సావిత్రి క్లాస్.. ఆ హీరోయిన్ కు ఇచ్చి పడేసిందిగా..!

వెండి తెరపై మహానటి సావిత్రి గారు చేసిన అద్భుతాలు ఎన్నో.. ఒక సాధారణ సినిమాలో పాత్రకు కూడా తన అసాధారణ నటనతో సినిమా రిజ్‌ ను ఎక్కడకో తీసుకువెళ్లేవారు. అందుకే ఆమెను మహానటిగా ప్రేక్షకులు తమ హృదయాల్లో పెట్టుకున్నారు. అయితే సావిత్రి గారికి సినిమా అంటే గౌరవం సెట్‌ ఎవరైనా సినిమాను తక్కువ చేసి మాట్లాడితే ఆమెకు విపరీతమైన కోపం వచ్చేది. అలానే ఓ స్టార్ హీరోయిన్ దీపకు సావిత్రమ్మ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చిందని కూడా అంటారు. ఆ స్టోరీ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.

Savitri Birth Anniversary: 20 Rare Photos of Telugu cinema's demigoddess |  Telugu Movie News - Times of India

రామ విజేత వారి ప్రొడ‌క్షన్ లో డైరెక్టర్ బాబురావు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు అప్పుడే యువనటి దీపను సావిత్రమ్మకు ఆయన పరిచయం చేశారు. అప్పుడు సావిత్రి ఆమెతో మంచి పాత్రలు చేస్తున్నవు అమ్మాయి అని అడిగారు దానికి వ్యంగ్యంగా దీప కనురెప్పలు ఆర్పుతూ తెలుగు మలయాళం తమిళమే కాదు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నాను. సావిత్రి నటనకి భాష ముఖ్యం కాదు ఏ క్యారెక్టర్ లో చేస్తున్నామన్నది ముఖ్యం.

Savitri Jewelry Secrets Revealed | cinejosh.com

తెలుగు తమిళ సినిమాల్లో చీర కొంగు ఎడమవైపు నుండి కుడి భుజం మీదకు ఉంటుంది. అదే హిందీ సినిమాల్లో అయితే ఒక్కోసారి కుడివైపు నుంచి ఎడమ భుజం మీదకు వేసుకోవాలి. ఇక మలయాళం అయితే అసలు కొంగే అక్కర్లేదు. భాషా కాస్టింగ్స్ కాదు ప్రతిభ చూపటానికి మంచి పాత్రలు రావాలని సావిత్రి అన్నారు. తర్వాత ఇద్దరు ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత రోజు దీప సినిమా షూటింగ్ కు లేటుగా రావడంతో కోపడ్డ సావిత్రమ్మ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చావు షూటింగ్ ఆలస్యంగా వస్తే ఎలా అనిఅరిచేరట.

Mahanati Savitri

ఒకప్పుడు నేను కూడా బిజీ నటనే కానీ నా కోసం షూటింగ్ సెట్లో ఎవరిని వెయిట్ చేయించే దాన్ని కాదు. అప్పుడు దీప మీరు పాత కాలంలో ఉన్నారమ్మ.. రోజు నేను ఎన్నో సినిమాల్లో నటిస్తున్న రోజు మూడు షిఫ్టులు జరుగుతున్నాయి ఉద్యమం నుంచి తలనొప్పి వల్లే లేటుగా వచ్చానని అంది. మీరు సీనియర్ కాబట్టి సంజాయిషీ ఇస్తున్నా అంటూ దీప అన్నది. అప్పుడు సావిత్రి ఓహో షూటింగ్ ఎగొట్టేద్దామనుకున్నావా ఇంట్లో ఎందుకు ఇక్కడే రెస్ట్ తీసుకో ఎలాగు ఈరోజు నీ సీన్ జబ్బున పడి మంచమెక్కే సీన్ కదా సెట్ లో మంచం రెడీగానే ఉంది నీరసంగా పడుకో న్యాచురల్ ఎఫెక్ట్ బాగుంటుందని అన్నారట. సావిత్రమ్మ అలా అనడంతో దీప వెంటనే షాట్ కు రెడీ అయ్యేందుకు వెళ్లారట. మనకు వచ్చిన అవకాశాలను మనం ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని అప్పట్లో సావిత్రి గారు తన తోటి నటులకు చెబుతూ ఉండేవారు. ఇలాంటి సందర్భాలు ఆమె జీవితంలో ఎన్నో ఉన్నాయి.