ఆచార్య డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని కొరటాల ఎన్టీఆర్ తో తెర్కెక్కించిన దేవర నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా దేవర ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. 140 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠీ హీరోయిన్లుగా నటించగా. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అయితే ఈ మూవీలో సైఫ్ కు భార్యగా నటించింది ఎవరో తెలుసా.. ఆమె మరి ఎవరో కాదు కన్నడ తెలుగు భాషల్లో బుల్లితెరపై ఎంతో ఫేమస్ ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగితే మాత్రం బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పి సిల్వర్ స్క్రీన్ పై ఫిక్స్ అయిపోవటం ఖాయం.
మరి ఆమె ఎవరనేది ఇక్కడ చూద్దాం.ఇంతకీ ఆమె మరెవరో కాదు.. చైత్ర రాయ్.. అష్టా చమ్మ సీరియల్ లతో తెలుగు తెరకు పరిచయమైంది చైత్ర. ప్రస్తుతం ‘రాధకు నీవేరా ప్రాణం’ నే సీరియల్ లో నటిస్తుంది. కన్నడ బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించిన చైత్రకు తెలుగు సీరియల్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ‘అష్టాచమ్మా’ తర్వాత ‘దటీజ్ మహాలక్ష్మీ’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ లాంటి సీరియల్స్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.
ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే చైత్ర.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ చైత్ర లుక్‌లో ఎలాంటి మార్పురాలేదు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే ఇంతకన్నా అదృష్టం ఏమంటుంది. ఇక మరి దేవర తర్వాత చైత్రకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.