మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన దేవర ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల వరకు కలక్షన్లు సాధించినట్టు సమాచారం.
తొలిరోజే అదిరిపోయే కలక్షన్ రాబెట్టినట్టు తెలుస్తుంది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇక హిందీ రాష్ట్రాల్లోనూ రూ.8 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మిగిలిన భాషలు ఓవర్సీస్ లో కలిపి మొత్తంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇలాగే ఒక వారం రోజులు పాటు సినిమా ఆడితే నిర్మాతకు లాభాల పంట పండటం కాయం. ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. కచ్చితంగా దేవర మంచి వసూళ్లు రాబడుతుంది. అలాగే టిక్కెట్లు అముకంలోనూ దేవర సంచల రికార్డును క్రియేట్ చేసింది. ఒక తెలంగాణలోనే కేవలం 12.88 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే గతంలో వచ్చిన కల్కి సినిమా తర్వాత వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా దేవర సంచలన రికార్డు సాధించింది.
ఇక సినిమాకు బిజినెస్ రూ. 400 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. మొత్తానికి దేవర మూవీ కలెక్షన్స్ భారీగా వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగేటట్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడింది.. ఇక నెక్స్ట్ రెండు ప్రాజెక్టులతో ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.