కార్తీ నటించిన సత్యం సుందరం రివ్యూ.. ఎలా ఉందంటే..!?

96 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రేమ్ డైరెక్షన్లో తాజాగా వచ్చిన చిత్రం సత్యం సుందరం. తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తీ, మరో సీనియర్ హీరో అరవిందస్వామి ముఖ్యపాత్రలో ఈ మూవీ తెరకెక్కింది.

అదేవిధంగా ఈ మూవీని కార్తీ అన్న మరో స్టార్ హీరో సూర్య 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి సినిమా మీద పడింది. దీనికి తోడు ట్రెజర్, ట్రైలర్ తో పాటు కొన్ని పాటలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ తమిళ్లో 27న తెలుగులో ఈరోజు ప్రేక్షకులుముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Satyam Sundaram Review: కార్తీ నటించిన 'సత్యం సుందరం' సినిమా ఎలా ఉందంటే.. | Satyam  Sundaram movie Review avm

స్టోరీ:
సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి) కుటుంబం గొడవల కారణంగా వారికున్న ఆస్తి అంతటినీ పోగొట్టుకుంటాడు. దీంతో మూడు తరాలుగా వారు ఉంటున్న అమరావతి ప్రాంతాన్ని వదిలి విశాఖపట్నం వెళ్ళిపోతారు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వారు ఉన్న పాత ప్రాంతానికి వెళ్ళని సత్యమూర్తి తన చెల్లెలు భువన పెళ్లి కోసం మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. భువన పెళ్లి దగ్గర సత్యమూర్తికి బావ అంటూ ఒక వ్యక్తి దగ్గర అవుతాడు. తన బంధువులు సైతం ఆ వ్యక్తితో ఎంతో చనువుగా మాట్లాడుతారు కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా సత్యమూర్తి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతని ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా సత్యమూర్తిని అతను వదిలి వెళ్ళకపోవటంతో ఆ ప్రయత్నాలు కూడా సఫలం కావు. ఇక చివరికి అతను ఎవరో సత్యమూర్తి ఎలా తెలుసుకున్నాడు? అసలు బావ అంటూ సత్యమూర్తి వెంటపడుతున్నది ఎవరు? సత్యమూర్తి వదిలేసిన సైకిల్ ఒక కుటుంబాన్ని మొత్తం ఎలా పైకి తీసుకొచ్చింది? చివరికి సత్యమూర్తి ఆ వ్యక్తిని మళ్ళీ కలిశాడా? విషయాలు తెలియాలంటే ఈ మూవీని థియేటర్లో చూడాల్సింది.

Satyam Sundaram Review: సత్యం సుందరం రివ్యూ - కార్తి, అర‌వింద్ స్వామి మూవీ  ఎలా ఉందంటే?-karthi arvind swamy satyam sundaram movie telugu review and  rating meiyazhagan ,ఎంటర్‌టైన్‌మెంట్ ...

విశ్లేషణ:
దర్శకుడు ప్రేమ్ కుమార్ ముందుగా దీన్ని ఒక నవలగా రాసుకున్నాడు. కార్తీతో మాత్రమే సినిమా చేయాలని పంతం పెట్టి పక్కన పెట్టేసిన స్క్రిప్ట్ ని అనుకోకుండా కార్తీ ఇచ్చిన పొత్పాలంతో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గరనుంచి ఒక రకమైన పల్లెటూరి వాతావరణంలో సాగుతూ ఉంటుంది. ఒక విధంగా ఇది కొత్త కథ ఏమీ కాదు. ఆస్తి గొడవల కారణంగా ఊరు విడిచి వెళ్లిపోయిన ఒక వ్యక్తి ఒక శుభకార్యం కోసం తన సొంత ఊరికి వెళితే అక్కడ తన మీద అతిగా ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరో తెలియక ఇబ్బంది పడుతూ సాగే కథ‌. ముందుగా దీన్ని నవలగా అనుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా అని పిచ్చి ఉండవచ్చు కానీ దీన్ని మూవీగా తీయడం అనేది చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. అలాంటి కథను ఒప్పుకున్న కార్తీ, అరవిందస్వామి ఈ విషయంలో చాలా రిస్క్ చేశారు. జీవితంలో సొంతవాళ్లు కూడా మనకి వెన్నుపోటు పొడుస్తారని నమ్మి.. తన కుటుంబాన్ని తప్ప బయట కుటుంబంలో వ్యక్తులను అసలు మాత్రం నమ్మకుండా తయారైన సత్యమూర్తి చివరికి అలాంటి వాళ్ళు మాత్రమే కాదు ఎలాంటి సాయం ఆశించకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారని తెలుసుకునే ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నిజానికి 2 గంటల 57 నిమిషాలు ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల సాగదీత ఫీలింగ్ కలుగుతుంది. కానీ కార్తీ తన కామెడీ టైమింగ్ తో దాన్ని మరిపింప చేసే ప్రయత్నం చేశాడు. బావ బావమరిదిల మధ్య వచ్చే కామిడి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. అయితే ఇదేదో తమిళ సినిమాల కాకుండా అచ్చ తెలుగు సినిమాల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో డబ్బింగ్ టీం కష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. మాస్‌ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చితో ఉందా లేదో చెప్పలేము కానీ.. అవార్డులు మాత్రం కచ్చితంగా అందుకొనే సినిమా అవుతుందని చెప్పవచ్చు.

Satyam Sundaram Review: 'సత్యం సుందరం' మూవీ రివ్యూ | Actor Karthi Starring Satyam  Sundaram 2024 Movie Review And Rating In Telugu | Sakshi

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన కార్తీ, అరవింద్ స్వామి, రాజ్ కిరణ్, జయప్రకాశ్, శ్రీదివ్య వంటి వాళ్లు ఒకరకంగా ఆయా పాత్రలలో నటించలేదు పూర్తిగా జీవించేశారు. నిజంగానే మనం ఏదో వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న సన్నివేశాలను పక్కనే కూర్చుని చూస్తున్నట్టు అనిపించేల చేశారు. సినిమా మొత్తం నటీనటులు తమ సాయిశక్తులా కృషి చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా సింక్ సౌండ్ ప్రతి ఫ్రేమ్లో అత్యద్భుతమైన ఔట్పుట్ ఇచ్చారు. ముఖ్యంగా సంగీతం బాగా పండింది. కొన్ని పాటలు చాల బాగు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్టు ఉంది. అయితే ఎడిటింగ్ విషయంలో మరికొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. లొకేషన్లు మాత్రం అత్యద్భుతంగా ఉన్న‌యి.. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

Satyam Sundaram 2024 movie review: రివ్యూ: సత్యం సుందరం.. కార్తి,  అరవిందస్వామి మూవీ ఎలా ఉంది? | satyam-sundaram-2024-movie-review-telugu

చివ‌ర‌గా.. సత్యం సుందరం ఒక ఎమోషనల్ డ్రామా.. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది కానీ చెల్లెలు అక్కలు ఉన్న వారికి సినిమా చూసిన వెంటనే వారికి ఫోన్ చేయకుండా ఉండలేరు.

రేటింగ్: 2.5