టాలీవుడ్‌లో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. మొదట ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటించిన సైఫ్.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర లోను విలన్ పాత్రలో మెరిసాడు. ఈ క్రమంలో ఎన్నో తెలుగు మీడియాలతో పాటు.. జాతీయ మీడియా ఇంటర్వ్యూలలోను పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో తాజా ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఫ్యామిలీ, పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పకొచ్చాడు. అవి ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి.
పిల్లలు.. నటులు కావాలని ఎప్పుడు నేను వాళ్ళని ఒత్తిడి చేయలేదంటూ చెప్పిన సైఫ్.. వాళ్లకు నచ్చిన విధంగా ఉండే స్వతంత్రాన్ని ఇచ్చానంటూ చెప్పుకొచ్చాడు. తన వారసులు ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఇప్పటికే ఇండస్ట్రీలో భాగమయ్యారని.. ఇక థైమూర్ అలీ ఖాన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రజల ముందు నేను అని నిజాలు చెప్పడానికి భయపడతా.. కానీ ఎప్పుడూ తైమూర్ తన పాఠశాలలో గేమ్స్ పై శ్రద్ధ పెడుతున్నాడని.. ఇక జెహా్ అలీ ఖాన్ పుట్టుకతోనే మంచి ప్రదర్శకుడు.. అతని ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చారు.
తన పిల్లలు తో సమయం గడపడం గురించి షేర్ చేసుకుంటూ.. ఇబ్రహీం అలీ ఖాన్ ఇటీవల తనను అమ్మాయిల వ్యవహారం గురించి అడిగాడని.. అతనికి సమాధానం ఇచ్చే ముందు కొంత ఆలోచించానని.. సైఫ్ చెప్పుకొచ్చాడు. ఒక సర్టెన్ స్టేజ్లో రిలేషన్ను ఎంత సీరియస్గా తీసుకోవాలో.. ఎలా ఉండాలో విశ్లేషణతో కొడుకుకి చెప్పానంటూ సైఫ్ వెల్లడించాడు. తమ రిలేషన్ ని అన్ని సమయాల్లో సీరియస్గా ఉండడం మంచిదంటూ సైఫ్ చెప్పుకొచ్చాడు. ఇబ్రహీం తన నటన గురించి.. గర్ల్స్‌తో సంబంధాల గురించి.. ఎప్పటికప్పుడు తండ్రితో క్లియర్‌గా చెప్తాడని.. సారా అలీ ఖాన్ తన వృత్తి గురించి సలహాలు అడుగుతుందంటూ.. సైఫ్ వెల్లడించాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.