సీతారామం సినిమాతో టాలీవుడ్ క్రేజి హీరోయిన్గా మంచి ఇమేజ్ దక్కించుకుంది మృణాల్ ఠాగూర్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపిల్లల తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తన అందం, అభినయంతో పాటు.. కట్టుబొట్టుతో యూత్ ను కట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు కట్టాయి. ఇందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన మృణాల్ మధ్యలో ప్రభాస్ కాల్కిలో చిన్న క్యామియో రోల్లో కనిపించి మెప్పించింది. ఇక్కడ ఈ సినిమా తర్వాత అమ్మడు సినిమాలో సెలెక్షన్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం హిందీలో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.
ఇక సినిమాలో విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. తన అందంతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంకా ఇందులో మృణాల్ అందాలకు ఫిదా అయినా యంగ్ బ్యూటీ శ్రీ లీల.. హాట్ త్రోబో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. అంటే మనసును దోచే అందమని అర్థం వచ్చేలా శ్రీలలా చెప్పుకోచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి.
View this post on Instagram