దేవర రెస్పాన్స్ పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు ఈ మాస్ యాక్షన్ డ్రామాను వీక్షించవచ్చా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.

Devara release trailer: Jr NTR, Koratala Siva promise a bloody actioner with strong emotional core | Telugu News - The Indian Express

ఈ నేప‌ధ్యంలో సినిమా రిలీజ్ అయి అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తొలిరోజే సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్ వద్ద క్యూ కడుతుండడంతో.. సినిమా టీమ్ అంతా దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక‌ తాజాగా దేవరకు వస్తున్నా రెస్పాన్స్ పై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చిందంటూ ఆయన చెప్పుకోచ్చాడు. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సంతోషం ఒప్పొంగిపోతున్నానంటూ వివ‌రించాడు.

Devara: Part 1 First Look - Bollywood Hungama

ఇలాంటి ఎంగేజింగ్ డ్రామా, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ నాకు అందించిన కొర‌టాల‌ శివకు ధన్యవాదాలు. అనిరుధ్‌ సంగీతం ఈ కథకు బ్యాక్ బోన్ ల నిలిచింది. అభిమానులు ఈ సినిమాను ఆదరిస్తున్న తీరుకు ఎప్పటికి రుణపడి ఉంటా. వీరి ప్రేమాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ తారక్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ట్రమాండస్ ఓపెనింగ్ వస్తున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను సినిమా మొదటి రోజు భారీ కలక్ష‌న్‌ల‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.