దేవర.. ఎవరు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..?

ఎట్టకేలకు టాలీవుడ్ ప్రేక్షకులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూసిన దేవర థియేటర్లలోకి వచ్చేసాడు. తారక్ యాక్టింగ్ అనిరుధ్‌ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సింగిల్ థియేటర్లలో తారక్‌ అభిమానుల రచ్చ మాములుగా ఉండడం లేదు. ఓ రేంజ్‌లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. థియేటర్లు దద్దరిల్లిపోయేలా విజిల్స్‌తో మోత పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఉంటుంది.

ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర. గతంలో తారక్‌తో జనతా గ్యారేజ్ తీసిన కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స‌ముద్రం బ్యాక్ ్రాప్‌తో దాదాపు రూ.300 కోట్ల బ‌డ్జ‌ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, మిక్కిలినేనిసుధాక‌ర్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తారక్ దేవర సినిమాకు రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్గా నటించిన జాన్వి కపూర్ రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుందట. విలన్ పాత్రలో చేసిన సైఫ్ అలి ఖాన్ రూ.10 కోట్లు.. ఇక‌ కీలక పాత్రలో న‌టించిన‌ ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళి శర్మ రూ.40 లక్షలు తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక‌ డైరెక్టర్ కొరటాల శివ ఏకంగా రూ.30 కోట్ల రెమ్యున‌రేషన్ అందుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.