జ‌క్క‌న బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన దేవర.. రాజ‌మౌళి కొడుకు ట్విట్‌ వైరల్..

టాలీవుడ్‌లో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేసిన తర్వాత ఎలాంటి స్టార్ హీరో అయినా సరే నెక్స్ట్ సినిమా డిజాస్టర్ ని ఎదుర్కోవాల్సిందే. అలా ఇప్పటివరకు ఎన్టీఆర్ తో మొదలుకొని రవితేజ వరకు జ‌క్క‌న‌తో సినిమా చేసిన‌ ప్రతి స్టార్ హీరో ఈ అనుభవాన్ని రుచి చూసినవారే. అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ మొదలైనది ఎన్టీఆర్ సినిమా నుంచే.. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకుడుగా, ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వ‌రుస ఫ్లాప్‌లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ మొదలయ్యింది. ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో జక్కన్న సినిమాలు తెర‌కెక్కించారు.Devara: Part 1 First Look - Bollywood Hungamaఆయనతో సినిమా తెరకెక్కించిన ప్రతి హీరో.. తర్వాత సినిమాలతో ఫ్లాప్ ఎదురుకోవడంతో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే దేవర సినిమాతో తన నుంచి మొదలైన బ్యాడ్ సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్‌ చేస్తాడా.. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌కు ఎన్టీఆర్ చెక్ పెడతాడా.. అంటూ ఎన్నో రకాల చర్చలు గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఫైనల్‌గా దీనికి సమాధానం వచ్చే సమయం దగ్గర పడింది. దేవర రిలీజ్ అయింది. ఇక ఈ బ్యాడ్ సెంటిమెంట్‌పై రాజమౌళి కొడుకు చేసిన ట్విట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ధియేటర్లలో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో.. సినిమాకు మిక్స్డ్ టాక్‌ వస్తుంది.Telugu) Devara: Part 1 +^*సినిమా బ్లాక్ బస్టర్ అని కానీ.. సినిమా ఫ్లాప్ అని కానీ.. కామెంట్లు రావడం కంటే దాదాపు చాలా వరకు యావరేజ్ టాకే నడుస్తుంది. రెండు మూడు రోజులు ఆగితే గాని పర్ఫెక్ట్ టాక్‌ బయటకు రాదు. ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినా.. సినిమా వసూలు బాగుంటే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌ను దేవర బ్రేక్ చేసినట్లే అవుతుంది. అయితే తాజాగా ఈ బ్యాడ్ సెంటిమెంట్ పై రాజమౌళి కొడుకు కార్తికేయ ట్విట్‌ చేశారు. ఎన్టీఆర్ ఓ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడంటూ ట్విట్ చేశాడు. 23 ఏళ్ల క్రితం ఎవరితోనైతే ఈ సెంటిమెంట్ మొదలైందో.. మళ్లీ అతనే దీన్ని బ్రేక్ చేశాడు అంటూ.. ఎన్టీఆర్ ను చూస్తూనే పెరిగా.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ చేస్తున్న అద్భుతాలు కళ్ళారా చూస్తున్నా.. అసలు స్పీచ్ లెస్ అయిపోయా.. అభిమానులకు ఒకటే చెబుతున్న.. దేవర‌ రూపంలో మనందరికీ సెలబ్రేట్ చేసుకునే పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఇకనుంచి సినిమానే మాట్లాడుతుంది. ఆల్ హెల్ ద టైగర్ అంటూ దేవర గురించి రాసుకొచ్చాడు. ప్రస్తుతం తండ్రి బ్యాడ్ సెంటిమెంట్ పై కొడుకు కార్తికేయ చేసిన కామెంట్స్ నెటింట‌ ట్రెండ్ అవుతున్నాయి.