టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలోనే పుష్ప సిక్వల్‌గా వస్తున్న పుష్ప 2 షూట్లో బిజీగా గడుపుతున్నాడు బన్నీ. కాగా తాజాగా దర్శకదు రాజమౌళి పుష్ప 2 సెట్ లో సందడి చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. పాన్ ఇండియన్ వైడ్‌గా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాదు.. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది.
అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మానియా కొనసాగుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా పుష్ప 2కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇలా ఉండగా.. కథలో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‌కు రాజమౌళి వచ్చి సందడి చేయడం అందరికీ షాక్‌నిస్తోంది. భారతీయ సినిమాకు గర్వకారణంగా పేరు తెచ్చుకున్న జక్కన్న.. దేశంలో అతిపెద్ద మాస్ సినిమా సెట్స్ ను సందర్శించడానికి పుష్పా టీం ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు.
రాజమౌళి సెట్లో కనిపించడంతో రాజమౌళి ఏమైనా గెస్ట్ రోల్‌లో కనిపిస్తున్నాడా అంటూ.. అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాజమౌళి ఇటీవల గెస్ట్ రోల్ లోను కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అలా ప్రభాస్ నటించిన కల్కిలో చిన్న గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పుష్ప2లో కూడా జగన్ గెస్ట్ ఎపీరియన్స్ ఇస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.