ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగు వెలిగిన సీనియర్ నటీనటులు ఇప్పుడు అమ్మ, అత్త పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా ఒకప్పుడు హీరోయిన్గా రాణించి.. ఇప్పుడు క్యారెట్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్న వారిలో సీనియర్ హీరోయిన్ కుష్బూ కూడా ఒకటి. కుష్బూ సుందర్ తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. సీనియర్ హీరోలు అందరితోనూ ఆడి పాడి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాలు, బుల్లితెర షోలతో పాటు.. రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి కుష్బుకు తమిళనాట విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
తమిళనాడులో ఈమె అభిమానులు ఏకంగా కుష్బూకి గుడి కట్టారనసంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. అంతలా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఇటీవల కాలంలో కుష్బూ సినిమాలు బాగా తగ్గించేసారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, సర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటించిన కుష్బూ.. తమిళ్లోను కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే కుష్బూ ఫ్యామిలీ గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది.
ఆమె భర్త సుందర్ ప్రముఖ డైరెక్టర్, నటుడుగా కూడా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల అరుణ్మనై4తో హిట్ అందుకున్న సుందర్ – కుష్బూ జంటకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు అవంతిక ఇప్పుడు నెటింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మడు విదేశాల్లో తన చదువును పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే అవంతిక గ్లామర్ పిక్స్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ లో అమ్మడి అందం తల్లిని బీట్ చేసేలా ఉంది. తన అందంతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంటుంది. అందాల ఆరబోతతో వయ్యారాలు వలకబోస్తుంది. ఇందులో భాగంగానే అవంతిక లేటెస్ట్ పిక్స్ నెటింట తెగ సందడి చేస్తున్నాయి.