పూన‌మ్‌కౌర్ వేసుకున్న ఈ చీర స్పెషాలిటీ తెలుసా..?

తాజాగా (అగ‌ష్టు7)న‌ జాతీయ చేనేత దినోత్సవాని అంతా పుర‌స్క‌రించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, స్టార్ సెలబ్రిటీస్.. చేనేత వస్త్రాలను ధరించి వాటికున్న ప్రాముఖ్యతను, ఆవశ్యకతను అందరికి తెలియజేశారు. వారంలో కనీసం ఒక్కరోజైనా చేనేత వ‌స్త్రాలను ధరించాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా జాతీయ చేనేత దినోత్సవం రోజున టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా కేరళ సాంప్రదాయకట్టులో తలుక్కున మెరిసింది.

చేనేత వస్త్రాల స్పెషాలిటీని తెలియజేసింది. ఇక పోనమ్ కౌర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు సంచలన పోస్టులు, కామెంట్స్‌తో వార్తలో నిలుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్ పై పూనమ్ కౌర్‌ చేసే పోస్ట్లు కామెంట్స్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేరళా సంప్రదాయ దుస్తులో మెరిసిన పూనమ్ కౌర్‌ దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ప్రస్తుతం అవి కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజ‌న్స్ అంతా అమ్మడి క్రేజీ ఫొటోస్‌కు ఫిదా అవుతున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే గతంలో పూనమ్‌ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. చేనేత వస్త్రా పరిశ్రమలకు తగిన గుర్తింపు తెచ్చేందుకు ఈమె తన వంతు సహాయం చేసింది. ఇప్పుడు అదే చేనేత వస్త్రాలను ధరించి చేనేత కారులను ప్రోత్సహించడానికి భాగంగా.. కేరళ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. స్వ‌యంగాఆ చేనేత కారులు త‌మ చేతుల‌తో చేసిన బంగారు వ‌ర్ణం చీర‌తో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజ‌న్ల‌ను భారీ లెవెల్‌లో ఆకట్టుకుంటున్నాయి.