ఫై ఫొటోలో బాన పొట్టతో.. బొద్దుగా కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా..? ఆయన ఒకప్పటి సౌత్ స్టార్ హీరో. హ్యాండ్సమ్ లుక్‌తో అమ్మాయిలను ఆకట్టుకున్న కలల రాకుమారుడు. 2000లలో వచ్చిన ప్రతి సినిమాలో తన స్టైల్‌తో యూత్ ఐకాన్‌గా ఉన్నారు.. హెయిర్ స్టైల్, డ్రసింగ్ ఇలా అనీ విషయలలో యూత్ అంతా ఈ హ్యాండ్సమ్ హీరోనే అనుసరించేవారు. ఇక ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోకి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక నటనల్లోనూ అదరగొట్టి మంచి మార్కులు కొట్టేసిన ఈ హ్యాండ్సమ్ హీరో.. అప్పట్లో అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోయాడు.
అయితే ప్రస్తుతం పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అవతారం కూడా అతని రియల్ పర్సనాలిటీ కాదు. ఓ సినిమా కోసం వేసుకున్న మేకవర్. మరి ఇంతకీ ఈయన ఎవరో గుర్తుపట్టారా..? అతనెవరో కాదు.. సఖి, చెలి సినిమాలతో తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నండీ మాధవన్. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున మూవీ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఇక ఈమూవీలో వయసు మళ్లిన నంబి రోల్ కోసం ఇలా పొట్ట పెంచి.. భారీగా బరువు పెరిగాడు మాదవన్. మనం పైన చూసిన ఫోటో ఆ సినిమాదే. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ షూటింగ్ సమయంలో బరువు పెరిగిన ఫొటోలను, బరువు తగ్గిన తర్వాత ఫొటోలను సోషల్ మీడియాలో మాధవన్ షేర్ చేయగా ప్రస్తుతం ఈ పిక్స్ నెటింట వైరల్‌గా మారాయి.
వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ నంబి పాత్ర కోసం మాధవన్ బాడీ మౌల్డ్ చేసిన విధానానికి ఫిదా అవుతున్నారు. అయితే ఈ మూవీ కోసం అలా బానపొట్ట పెంచిన మాధవన్ మళ్లీ ఇప్పుడు మళ్ళీ గతంలోలా హ్యాండ్సమ్ లుక్‌కు మారిపోయాడు. అది కూడా కేవలం మూడు వారలలో కావడం విశేషం. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలను కూడా హీరో ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్‌లో హీరోగా అలరించిన మాధవన్.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లోను విలన్‌గా అదరగొడతున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఈ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. .