ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న సంగతి తెలిసింది. కల్కి 2898 ఏడీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ వెయ్యి కోట్ల వసూళ్ళు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్న ప్రభాస్.. ఇండియన్ సినిమాలోనే తిరుగులేని స్టార్‌డంను సంపాదించుకున్నాడు. కాగా.. కెరీర్ ప్రారంభంలో తను రిజెక్ట్ చేసిన సినిమాకు మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ హీరో పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ప్రభాస్ వదులుకున్న ఆ హిట్ సినిమా ఏంటో.. పాన్ ఇండియా లెవెల్‌తో దూసుకుపాతున్న ఆ స్టార్ హీరో ఎవరు ఒకసారి తెలుసుకుందాం.
అతను మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసింది. అయితే ఊహించిన రేంజ్ లో కలెక్షన్లు మాత్రం రాబట్ట లేకపోయింది. దీంతో తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో ఉన్న బన్నీ.. అప్పట్లో ఎన్నో కథలను విన్నాడట. అయితే ఆ కథలేవి ఆయనకు నచ్చలేదు. క్రేజిగా ఇంకా కథలో ఏదో ఉండాలని ఒక సరైన కథ కోసం వెయిట్ చేశాడు. అలాంటి సమయంలో ప్రసాద్ ల్యాబ్లో సుకుమార్.. బన్నీని కలిసారట. ఇక అక్కడ ఆర్య కథ విన్న బన్నీ కథ బాగా నచ్చేయడంతో ఎలాగైనా ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడట. అయితే ఈ సినిమా కథను సుకుమార్.. బన్నీ కంటే ముందు ప్రభాస్‌కు వినిపించాడట. అయితే సుకుమార్‌కు అది మొదటి సినిమా కావడంతో.. ప్రభాస్ ఆ సినిమా సక్సెస్ అవుతుందో లేదో అని ఆలోచనతో దానిని రిజెక్ట్ చేసారట.
ఇక తర్వాత బన్నీఆ కథ కోసం అల్లు అరవింద, చిరంజీవిలతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. ఎలాగైతే చివరకు సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్రేజీ లవ్ స్టోరీగా, ట్రెండ్ సెట్టర్గా రికార్డ్స్ సృష్టించింది. ఈ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి వరుస సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా తెరకెక్కిన పుష్ప తో సక్సస్ అందుకోవటమే కాదు.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్‌ను సృష్టించాడు. ఇక ఈ సినిమాకు సక్వెల్‌గా పుష్ప 2 తో పాన్ వరల్డ్ మార్కెట్‌పై టార్గెట్ చేస్తున్నాడట బన్నీ. డిసెంబర్లో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.