టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా భారీ క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇక ఈ సినిమాల్లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. ఓ పాత్రలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడట.
ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శంకర్ డైరెక్షన్‌లో తాజాగా ఇండియన్ 2 రిలీజై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమాపై మరింత ఫోకస్ చేశాడట శంకర్. దిల్ రాజు, రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. సినిమాలో ఏ చిన్న పార్ట్ సరిగ్గా రాకపోయినా రీ షూట్ చేసేందుకు దిల్ రాజు పర్మిషన్ ఇచ్చాడట. డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది అని తెలిసినా గేమ్ చేంజర్ కోసం దిల్‌రాజు ఆ సాహసం చేయడానికి కూడా సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పొజిషన్‌లో రాంచరణ్‌కి, శంకర్‌కి ఈ సినిమా హిట్ కొట్టడం చాలా అవసరం.
ఈ సినిమా హిట్ అయితే రామ్ చరణ్ మరో మెట్టు ఎక్కుతారు. అలాగే శంకర్‌కు ఇండియన్ 2 ఫ్లాప్ తో వచ్చిన నెగటివిటీపోయి మరోసారి స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో శంకర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా సినిమాతో ఎలాగైనా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టీజర్ గానీ, ట్రైలర్ గానీ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషన్ వీడియో రిలీజ్ కాలేదు. ఎప్పుడెప్పుడు సినిమా నుంచి ప్రమోషనల్ వీడియో రిలీజ్ అవుతుందా అంటూ చరణ్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా ఎలా ఉంటుందో అనే విషయంపై కూడా మెగా అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.