టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే తారక్‌ను వెండితెరపై చూసి రెండేళ్ళు గడిచిపోవటంతో.. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అంతేకాదు కొరటాల శివ ఆచార్య ప్లాప్ తర్వాత తెరక్కిస్తున్న సినిమా కావడంతో.. ఆయన కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని కాసితో ఉన్నాడట. ఈ క్రమంలో దేవరపై కొరటాల, ఎన్టీఆర్ ఇద్దరు చాలా పట్టుదలతో శ్రమిస్తున్నారు.
ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకుల అంచనాలను ఆదుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియన్ సినిమా దేవర కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ నేపద్యంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు అంటూ మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
సినిమాలో మొదట పాత్రలో సముద్ర ప్రాంతానికి చెందిన గిరిజనుడుగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని.. మరో పాత్రలో ఉత్తర భారత దేశంలో ఓ సిటీకి చెందిన కుర్రాడిగా కనపడనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ తో దేవర కథ ఇలానే ఉండబోతుందని.. ఆయన కచ్చితంగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. ఇక కొరటాల శివ స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుందంటూ అనిరుధ్ చేసిన కామెంట్స్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. ఇక సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.