నిజాయితీగా ఏ మంచి పని చేసినా ప్రజలకు అండగా నిలబడిన జనం ఆ వ్యక్తికి అభిమానులవుతారు. పబ్లిసిటీ స్టంట్ కోసం నిజాయితీని నటించే వారికి ఎప్పుడు ప్రజల అభిమానం దక్కదు. మంచివారు ఎవరో.. మంచితనాన్ని నటిస్తున్న వారు ఎవరో.. ప్రజలు ఇట్టే అర్థం చేసుకోగలరు. అయితే ఓ యాక్టర్ ఎప్పుడు మనస్ఫూర్తిగా ప్రజలకు మంచి పనులు చేస్తూ.. మనసున్న మహారాజు గా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్. ఎన్నో శివన్న అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్న శివరాజ్ కుమార్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. కంటిరవ రాజ్.. శివన్న, పునీత్ రాజ్ కుమార్ ఇద్దరిని తెలుగు డైరెక్టర్లతో ఇండస్ట్రీకి పరిచయం చేయించాడు.
సింగీతం శ్రీనివాసరావు శివరాజ్ కుమార్ ఫస్ట్ సినిమాను దర్శకత్వం వహించడు. ఇక పూరి జగన్నాథ్ పునీత్ రాజ్ కుమార్ ను ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. మొదటి సినిమాన్నే మాతృభాష కన్నడ స్టార్ డైరెక్టర్లతో లాంచింగ్ చేస్తే అంచనాలు పెరిగి.. సినిమా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందని.. టాలీవుడ్ లో ఎంట్రీ ప్లాన్ చేశారు రాజ్ కుమార్. కొడుకుల ఎంట్రీ అంటే అక్కడ రచయితలు ఎన్నో కంటెంట్స్ ఇస్తూ ఉంటారు.. దానివల్ల ప్రేక్షకుల్లో సినిమాపై మరి మీ అంచనాలు పెరుగుతాయి. అంచనాలను రీచ్ కాకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. అందుకే మొదట తెలివిగా సక్సెస్ ఫార్ములాను వాడారు. ఇక శివరాజ్ కుమార్ నటించిన మొదటి మూడు సినిమాల్లో సూపర్ హిట్లుగా నిలిచాయి. మంచి హీరోగా తనకంటూ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.
ఓం సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడు. ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 1995 నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు ఈ సినిమా రీ రిలీజ్ అవుతూనే ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో ఆయన నటన ఎంత స్పెషల్గా ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థమవుతుంది. ఇది తెలుగులో ఓంకారంగా ఈ మూవీ రీమిక్స్ చేశారు. ఇక ఓం సినిమాతో శివన్న అందరికీ ఫేవరెట్ హీరోగా మారాడు. ఆ తర్వాత వరుసగా రెండు, మూడు బ్లాక్ బస్టర్ హీట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. పదేళ్ల తర్వాత జోగి సినిమాతో మళ్ళీ ఓం లాంటి ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమారిలీజైనా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇదే సినిమా జోగి గా రీమిక్స్ చేశారు. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ సృష్టించింది.