అసలు విడాకులకు కారణమే అది.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ వర్షా బొల్లమా షాకింగ్ కామెంట్స్..

కన్నడ బ్యూటీ వర్షా బొలమ్మ‌ మొదట కోలీవుడ్‌లో తన కెరీర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2015లో సతురన్ మూవీలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత కూడా అమ్మడు ఎన్నో చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించినా.. సపోర్టింగ్ రోల్స్ లో కూడా ఆకట్టుకుంది. ఇక విజయ్‌ బ్లాక్ బస్టర్ మూవీ బిగిల్‌లో లేడీ ఫుట్బాల్ టీంలో ఒక ప్లేయర్ గా ప్రేక్షకులు మెప్పించింది. త‌ర్వాత‌ చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

Varsha Bollamma Biography

ఓ కొత్త హీరో జంటగా ఈ అమ్మడు వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆనంద్ దేవరకొండకు జంటగా మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలోను మెప్పించింది. ఈ సినిమా తర్వాత పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా ఆకట్టుకున్న వర్ష.. ఇటీవల రిలీజ్ అయిన ఊరు పేరు భైరవకోన సినిమాలో సందీప్ కిషన్కు జంటగా మెప్పించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు.

Varsha Bollamma Biography

దీంతో ఈ సినిమా తర్వాత అమ్మడు కొత్త సినిమా ఏది ప్రకటించలేదు. ఇదిలా ఉంటే తాజాగా విడాకుల గురించి రియాక్ట్ అవుతూ వర్ష బొలమ్మ‌ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తున్నాయి. ఓ లేడీ ఫ్యాన్ ఆమెను ఈ రోజుల్లో వ‌రుస విడాకులకు కారణమేంటి.. అని ప్రశ్నించగా అసలు ఆలోచించకుండా ఓపెన్ గా రియాక్ట్ అయింది వర్ష బొల‌మ్మ‌ వివాహమే విడాకులకు మొదటి కారణం అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. అసలు పెళ్లి లేకపోతే విడాకుల ప్రస్తావనే ఉండదు కదా. కనుక విడాకులకు మొదటి కారణం పెళ్లి అంటూ తెలివైన సమాధానాన్ని ఇచ్చి తప్పించుకుంది.