అక్కినేని మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య. జేష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా పలు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో చందుమొండేటి డైరెక్షన్‌లో తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రం నేపథ్యంలో మత్స్యకారుని జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో ఓ మత్స్యకారుని పాత్రలో చైతు నటించబోతున్నాడు.
సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా గతంలోనే చందు, చైతు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి లాంటి సినిమాలు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా చైతన్యకు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకరు తల్లిగా, ఫ్రెండ్ గా, లవర్‌గా నటించి మెప్పించారంటూ వార్తలు సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఆమె మరెవరో కాదు టాలీవుడ్ క్యూట్ బ్యూటీ.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జునకు భార్యగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజు మూవీ నాగార్జున కొడుకుగా నాగచైతన్య కనిపించాడు. అలాగే మనం సినిమాలో.. లావణ్య, నాగచైతన్య స్నేహితులుగా కనిపిస్తారు. ఓ చిన్న పాత్ర లావణ్య టక్కున మెరిసి మాయమవుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో యుద్ధం శరణం సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే సినిమా ఊహించి రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో.. ఈ కాంబో అంతగా హైలెట్ కాలేదు. అయినా లావణ్యకు.. నాగచైతన్యతో కలిసి తల్లిగా, లవర్ గా, ఫ్రెండ్ గా నటించిన ఏకైక హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్తలు నెటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.