టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్‌స్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శంకర డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్.. ఈ సినిమా తుది దశకు చేరడంతో.. తన నెక్స్ట్ సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆఆర్ఆర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో వస్తున్న సినిమా కావడంతో ప్రస్తుతం చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో చరణ్.. జాన్వి కపూర్ హీరోయిన్గా మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వివరించనన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్.
ఈ క్రమంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నా చరణ్.. ఓ సినిమా కథను వదులుకోవాల్సి వచ్చిందని.. ఆ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథను మరొక హీరో చేయడం.. ఓ హీరోతో మూవీ అనౌన్స్ చేసిన తర్వాత ఏవో కారణాలతో ఆగిపోయి.. అదే కథతో మరో హీరో సినిమా తెరకెక్కించడం.. ఇలాంటివి కామన్‌గా జరుగుతుంటాయి. అలా గతంలో రామ్ చరణ్, గౌతమ్ తిననూరి డైరెక్షన్లో.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేసారు. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా రాంచరణ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. మార్కెట్ అమాంతం పెరగడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయింది.
అప్పటినుంచి యూవీ క్రియేషన్స్ వారు రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ కథ తయారుచేసి అతనితో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నారట. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ నర్తన్ దగ్గర యూవీ సంస్థ వాళ్లు ఒక కథను విన్నారట. ఆ కథ నచ్చడంతో రామ్ చరణ్‌తో ఆ సినిమా చేస్తే సరిగా ఉంటుందని వారు భావించారట. ఈ క్రమంలో నర్తన్.. రాంచరణ్ కోసం కథను సిద్ధం చేసి వినిపించాడట. ఆ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వస్తుందని అంతా భావించారు. అయితే ఆ ప్రాజెక్ట్ పై ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోవడంతో అవి రూమర్లని క్లారిటీ వచ్చేసింది.
అయితే తాను బిజీలో ఉన్నానని.. తర్వాత కలిసి ఆ సినిమాను చేద్దామని రామ్ చరణ్ నర్తన్కు క్లారిటీ ఇచ్చేసాడట. ఈ క్రమంలో నర్తన్.. తన నెక్స్ట్ సినిమాను సూర్యతో చేసేందుకు అంత సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు కేవియన్ ప్రొడక్షన్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్నారట. ఈ సంస్థ ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ తో టాక్సిక్ సినిమాను రూపొందిస్తుంది. దీంతో రామ్ చరణ్‌కు గతంలో చెప్పిన కథను మెరుగులు దిద్ది అదే కథతో సూర్య హీరోగా పెట్టి సినిమా తరికెక్కించనున్నాడని.. భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలను నిజమెంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.