‘ రాజాసాబ్ ‘ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. అలా చేస్తే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పక్కా.. !

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లను అందుకని బిజీ లైనప్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్ష‌న్‌లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇటీవ‌ల‌ నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలవడం.. అలాగే రాజాసాబ్‌ పక్క కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కడంతో.. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2025 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే రిలీజ్ చేయాలని మాస్టర్ ప్లాన్‌లో టీం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల వారం రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో రాజాసాబ్‌ మాత్రమే రన్ అవుతుంది. తర్వాత రోజుల్లో ధియేటర్లు తగ్గినా సంక్రాంతి సెలవల‌తో ఈ సినిమా అప్పటికే క్యాష్ చేసుకొనే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభాస్ సంక్రాంతికి వారం ముందే సినిమాను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ టాక్‌తో పాటు.. భారీ వసూళ్ల వర్షం కూడా కురిపించే అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో సంక్రాంతి విజేతగా రాజాసాబ్ నిలిచి.. మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాజాసాబ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం సలార్, కల్కి తో బ్లాక్ బ‌స్టర్లు అందుకని దూసుకుపోతున్న ప్రభాస్.. రాజాసాబ్‌ నాన్ ధియేట్రిక‌ల్‌ హక్కులకు కూడా ఊహించిన స్థాయిలో డిమాండ్ ఏర్ప‌డింది. ఇక ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరోగా మారినప్పటి నుంచో పక్క ప్లాన్‌తో ప్రతి ఆరు నెలలకు ఒక్క సినిమా అన్నా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించిన కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 3 లేదా 4లో రాజాసాబ్ సినిమా రిలీజ్ చేసేలా టీంతో క‌లిసి ప్లాన్ చేస్తున్నాడట డార్లింగ్.