‘ఏమాయ చేసావే ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది సమంత. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక గతంలో అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు 4ఏళ్లకే ఏవో మనస్పర్ధలతో చైతూకి విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరిదారి వారు చూసుకుంటూ.. పర్సనల్ లైఫ్ లో బిజీగా గడుపుతున్నారు.
అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు మయోసైటిస్ భారిన పడడంతో సినిమాలకు ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చి ఆరోగ్యం పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం రీఎంట్రీకి సిద్ధమవుతున్న సమంత.. తన సినిమాలకు సంబంధించి ఇటీవల ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ.. తన యోగ, హాట్ గ్లామర్ ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోస్ , వీడియోస్ మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వాళ్ళను ఫిదా చేస్తుంది. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన ఓ వీడియో నెటింట తెగ వైరల్గా మారింది. గతంలో సమంత.. ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది.
అందులో భాగంగా సమంత మాట్లాడుతూ చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆమెను ఆహారం, శృంగారం ఈ రెండిట్లో దేని సెలెక్ట్ చేసుకుంటారు.. ఏది లేకుండా ఉండగలరు అని ప్రశ్న అడగ్గా.. దానికి కాసేపు ఆలోచించిన ఈ అమ్మడు.. ఫుడ్ లేకున్నా ఒకే కానీ.. సెక్స్ లేకుండా అసలు ఉండలేను అన్న విధంగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వీడియో నెటింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంత బోల్డ్ గా చెప్పేసావ్ ఏంటి సమంత అంటూ.. నిజంగానే ఇలాంటి కామెంట్ చేయడానికి చాలా డేర్ ఉండాలి.. మీ డేర్కు హ్యాండ్సప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram