టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతుందంటే చాలు.. ఆ సినిమా సెట్స్ పైకి అయినా రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలైపోతాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ దర్శకుడుగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కేవలం ఇండియాలోనే కాదు.. జపాన్ లోనూ రాజమౌళి సినిమాలు భారీ పాపులారిటీ దక్కించుకున్నాయి. అక్కడ కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమా విజువల్స్ పరంగా భారీ లెవెల్లో ఆకట్టుకోవడంతో.. హాలీవుడ్ దర్శకులు కూడా జక్కన్న విజన్‌కు ఫిదా అయ్యారు. ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పాన్ వరల్డ్ రేంజ్లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కున్న ఈ సినిమాలో మహేష్ నయ లుక్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. రాజమౌళి స్వయంగా ఓ స్టార్ హీరోకు పిలిచి మరీ అవకాశం ఇస్తే ఆయన రిజెక్ట్ చేశాడంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఆయన సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం.
ప్రస్తుతం రాజమౌళికి ఉన్న క్రేజ్ రీత్యా చిన్న పాత్ర అయినా సరే ఆయన సినిమాలో నటించే ఆకాశం వస్తే వదులుకోవడానికి ఏ స్టార్ హీరో ఇష్టపడడం లేదు. అలాంటిది తమిళ్ క్రేజీ హీరో సూర్య.. ఓ సందర్భంలో రాజమౌళి సినిమాలో సెకండ్ హీరోగా ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేశాడట. ఆ సినిమా మరేదో కాదు నితిన్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సై. ఈ సినిమాలో సెకండ్ హీరోగా మొదట సూర్యుని భావించారట. కానీ సెకండ్ హీరో రోల్ కావడంతో అప్పుడే హీరోగా ఎదుగుతున్న సూర్య ఆ టైంలో సెకండ్ హీరోగా చేస్తే తర్వాత ఛాన్స్‌లు రావేమో అని సందేహం మొదలైందట. ఈ నేపథ్యంలో రాజమౌళి స్వయంగా అడిగిన కూడా కథను రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత సూర్య పాత్రలో సుశాంక్ నటించాడు. ఇక ఈ సినిమా అప్పట్లో యూత్ కు బాగా కనెక్ట్ అవడంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచింది.