వెయ్యి కోట్లు కొట్టిన కల్కి ఆ చిన్న సినిమా ముందు నథింగా.. అశ్వినీ దత్ కు అంతాల లాభాలు తెచ్చి పెట్టిన సినిమా ఏంటంటే.. !

ఈ ఏడాది రిలీజై అత్యధిక గ్రాస్‌వ‌సూళ్ళు కొల్లగొట్టిన టాలీవుడ్ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ప్రభాస్ మార్కెట్‌ను మరింతగా పెంచింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ లోనే కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. ప్రస్తుతం వెయ్యి కోట్లు మార్క్ దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ఆర్‌ఆర్ఆర్ రికార్డులను కూడా బ్రేక్ చేసి పడేసింది. ఇలా దాదాపు రూ.120 నుంచి రూ.130 కోట్ల వరకు నిర్మాతలకు లాభాలను కురిపించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ అశ్విని దత్. అయితే ఆయన కెరీర్‌లో భారీ లాభాలు వచ్చిన సినిమా మాత్రం కల్కి కాదట‌.

Kalki 2898 AD: Prabhas film to release in June, see new poster - India Today

వెయ్యకోట్లు రాబట్టిన కల్కి సినిమా.. ఆ చిన్న సినిమా ముందు బలాదూరే అంటూ తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో.. అసలు కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ హీరోగా తెర‌కెక్కిన‌ పెళ్లి సందడి టాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టించింది తెలిసింది. అశ్వినీ ద‌త్త్‌, అల్లు అరవింద సంయుక్తంగా స్మాల్ బడ్జెట్‌తో ఈ సినిమా తెర‌క్కించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వ‌చ్చిన ఈ మూవీలో రవళి, దీప్తి పట్నాగర్ హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. ఓ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన్న ఈ సినిమా సంక్రాంతి కానుక 1996 జనవరి 12న రిలీజై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ సినిమా పండగ సెలబ్రేషన్స్ కు తగ్గట్టుగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Pelli Sandadi - Wikipedia

ఇక గతంలో మూవీ రిలీజ్‌కి ముందే సీడీల‌ రూపంలో ఆ సినిమా సాంగ్స్ రిలీజ్ అయ్యేవి. జనాల్లోకి కీరవాణి సాంగ్స్ విపరీతంగా వెళ్తూ ఉండేది. ఇక విలన్ రోల్స్ చేస్తున్న శ్రీకాంత్ అప్పుడే హీరోగా ఎదుగే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ఆటైంలో పెళ్లి సందడి అవకాశం వచ్చింది. ఈ సినిమాతో ఆయన దశ మారింది. కేవలం రూ.1.25 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సమయానికి రూ.13 కోట్ల గ్రాస్‌వ‌సుళ‌ను కొల్లగొట్టి దాదాపు ప్రొడ్యూసర్లకు 10రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. చిన్న సెంటర్స్ లో కూడా సిల్వర్ జూబ్లీ ఆడి సంచలనం సృష్టించింది. ఇక అప్పట్లో కేవలం టికెట్ ధర రూ.5 నుంచి రూ.30 ఉండేది. అయినా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం అనేది నిజంగా సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో.. పెళ్లి సందడి కలెక్షన్లతో పోల్చుకుంటే కల్కి కలెక్షన్లు నిజంగా రికార్డే కాదు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజ‌న్లు.