టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రాజమౌళి. ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన తెరకెక్కించిన ప్రతి సినిమాలో 100% సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న జక్కన్న.. పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి సిరీస్‌లతో పాటు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా తెరకెక్కించి పాన్ ఇండియన్ స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. దర్శకధీరుడుగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా జక్కన్న సినిమాలపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఈ క్రమంలో రాజమౌళి సినిమాలో హీరోలుగా నటించిన ప్రతి ఒక్కరికి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందాయి. భారీ క్రేజ్ కూడా వచ్చింది. అయితే రాజమౌళి డైరెక్షన్లో నటించిన హీరోలకు ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఆయన సినిమాలో నటించిన వెంటనే ఎంత పెద్ద ప్రాజెక్టులో నటించినా కూడా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గానే ఉంటుంది. చాలామంది చాలా సంవత్సరాల పాటు అపజయాల్లో కూరుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఆఖరుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహించడు మూవీలో హీరోగా నటించిన చరణ్ ఇప్పటికే కొరటాల డైరెక్షన్లో ఆచార్య సినిమాలు నటించి డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఈ సెంటిమెంట్ చరణ్ కూడా వర్కౌట్ అయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లోనే దేవర సినిమాలో నటిస్తున్నాడు.
తారక్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెరకెక్కుతున్న మొదటి సినిమా దేవర కావడంతో.. ఇప్పుడు ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు ఎక్కడ వర్కౌట్ అవుతుందో అనే టెన్షన్ లో ఉన్నారు అభిమానులు. ఇక ఇదే బ్యాడ్ సెంటిమెంట్ కనుక దేవరక కూడా వర్కౌట్ అయితే కొరట్టాల శివకు పెద్ద ప్రమాదం తప్పదు. దేవర సినిమాతో కొరటాల ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఆచార్యతో ప్లాప్ ఎదుర్కొన్న ఈయన.. ఎన్టీఆర్ దేవరతో అయినా సక్సెస్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని తారక్ తో పాటు.. కొరటాలు కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక దేవరతో కచ్చితంగా కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొడితే రాజమౌళి సినిమా తర్వాత మొట్టమొదట విజయం దక్కించుకున్న హీరోగా ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌కు సక్సెస్ ఇచ్చినందుకు కొరటాల శివ కూడా కొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు అవుతుంది. ఇక ఈ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.