నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హిట్ మూవీ 1,2 సిరీస్‌లు ఎలాంటి రేంజ్ లో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెన్స్ గా హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే ఈ సినిమా కోసం ఈసారి నానినే హీరోగాను, ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. స్టార్ హీరో రానా కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ తెలుస్తుంది.
నాని, రానా మల్టీస్టారర్ గా ఈ సినిమా భారీ లెవెల్‌లో ఉండనుందని సమాచారం. ఇక దగ్గుబాటి రానా, నాచురల్ స్టార్ నానిల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బావ, బావ అంటూ స్వీట్‌గా పిలుచుకుంటూ గతంలో ఓ అవార్డు వేడుకలో హోస్టులుగా వీళ్ళిద్దరూ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచి తమ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు వీరిద్దరి కలిసి ఒక మల్టీ స్టారర్ కూడా చేయలేదు. ఇక ఇప్పుడు ఈ కాంబోలో ఓ సినిమా రిలీజ్ అయితే అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉంటుందన్న సందేహం లేదు.
ఇక ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో రానా నానితో తలపడే పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడట. డైరెక్టర్ శైలేష్ కొలను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. ఈ సినిమాలో విలన్ పాత్రకు రానా అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని భావించారట. ఇక రానా కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబో సినిమా ఫిక్స్ అయ్యింది. అయితే ఈ మల్టీ స్టారర్ సెట్స్ పైకి ఎప్పుడు వస్తుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.