కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. కౌసల్య కృష్ణమూర్తి సినిమా తో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరస అవకాశాలను అందుకుని సినిమాల్లో మెప్పించింది. అయితే అమ్మడు తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోయినా.. ఇతర భాషల్లో తన నటనతో అవకాశాలను దక్కించుకుంటూ నటిస్తోంది.
ఈ క్రమంలో ఇన్నాళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో టాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అది కూడా స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమాను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే మీనాక్షి చౌదరి ఫిక్స్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ ను సెలెక్ట్ చేసినట్లు అనీల్ రావిపూడి వివరించాడు.
ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఫుల్ యాక్షన్ ఎంట్రటూనర్‌గా సాగే ఈ సినిమాల్లో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించనుందని.. ప్రియురాలుగా మీనాక్షి చౌదరి ఉండనుందని చెప్పుకొచ్చాడు. జులై 3 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందుని.. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామంటూ వెల్లడించాడు.