నందమూరి నటసింహమ బాలయ్య నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న మోక్షజ్ఞకు.. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మొదటి సినిమా కూడా సెట్స్‌పైకి రాకముందే.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మోక్షజ్ఞ.. తన మొదటి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నటిస్తున్నాడని.. కొద్ది రోజుల క్రితమే వార్తలు వైరల్ అయ్యాయి. హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ షీట్ అందుకున్న ప్రశాంత్ వర్మ అయితేనే.. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సరైన దర్శకుడుని బాలయ్య ఇలా మాస్టర్ ప్లాన్ వేశాడట. ప్రశాంత్ వర్మను నమ్మి ఛాన్స్ ఇచ్చాడట. ఇక ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞతో ఎలాంటి సినిమా తెరకెక్కించనున్నాడు అనే ప్రశ్నకు క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టిన రోజులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఇక ఈ దసరా పండుగ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని.. నవరాత్రుల సమయంలో మంచి ముహూర్తం చూసి.. మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా బాలయ్య ప్లాన్ చేశాడని తెలుస్తుంది. ఇక తనయుడు సినీ ఎంట్రీ కోసం.. సినిమాపై అంచనాలను అందుకునేలా చేసే ప్రయత్నాలను వేటిని బాలయ్య మిస్ చేయకుండా.. కచ్చితంగా ఫాలో అవుతున్నాడు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని.. బాలయ్య అహర్నిశలు కృషి చేస్తున్నాడు.
మాస్టర్ ప్లాన్స్ వేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ కి అంతా సన్నద్ధం చేస్తున్నాడు. మొదటి సినిమాలో బాలయ్య కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయట. తనయుడు ఎంట్రీ కోసం బాలయ్య పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేయడం నిజంగానే విశేషం. పొలిటికల్గాను అనుకూల పరిస్థితులు నెలకొన్న క్రమంలో.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీస్తే సరిగా ఉంటుందని బాలయ్య భావిస్తున్నాడట. ఇక మొదటి నుంచే మోక్షజ్ఞ యాక్టింగ్ లో పూర్తి శిక్షణ తీసుకున్నాడు. అలాగే నందమూరి అభిమానుల సపోర్ట్ ఆయనకు ఫుల్ గా ఉంది. ఈ క్రమంలో కచ్చితంగా మోక్షజ్ఞ బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఖాయమంటూ అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ ఎన్నో అవార్డులు దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.