రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ రోహిణి.. వీడియో వైరల్..?

రేవ్ పార్టీలు అనేవి ఇప్పుడు ఎక్కడికక్కడ చాలా కామన్ గా మారిపోయాయి. వీకెండ్ వస్తే చాలు ఎంతోమంది యూత్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ పార్టీలో జాయిన్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దాదాపు ఈ పార్టీలు రహస్యంగానే జరుగుతాయి. ఒకవేళ ఎప్పుడైనా ఇదే పార్టీ సంఘటనలు బయటకు వస్తే తమ ఇమేజ్ కి ప్రాబ్లం అని కొంతమంది దీనిని రహస్యంగా ఉంచుతుంటారు. మరి కొంతమంది మాత్రం కొన్నిసార్లు మీడియాకు అడ్డంగా దొరికిపోయి తెగ వైరల్ అవుతారు. కొద్ది రోజుల క్రితం నటి హేమ కూడా ఇదే విధంగా బెంగళూరు పార్టీ కేసులో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆమె డ్రగ్స్ తీసుకుందని తేలడంతో అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు.

Anchor Rohini's Alleged Rave Party Video Goes Viral

తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది. ఈ నేపద్యంలో తాజాగా మరో నటి రేవ్‌ పార్టీలో అడ్డంగా దొరికిపోయింది అంటూ వీడియో నెటింట వార్లు చెక్కర్లు కొడుతున్నాయి. జబర్దస్త్ ఫేమ్ రోహిణి.. ఎన్నో బుల్లితెర సీరియల్ లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జబర్దస్త్ షోలో రాణిస్తున్న ఈ అమ్మడు మొదట గెస్ట్ గా వచ్చి తర్వాత కమెడియన్ గా మారిపోయింది. పలు సినిమాలలో, వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్న రోహిణి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ తన కంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కేరీర్‌ స్పీడ్ అప్ చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్న క్రమంలో.. తాజాగా ఓ రేవ్ పార్టీకి వెళ్లి దొరికిపోయినట్లు సమాచారం. కానీ ఇది నిజమైన రేవ్ పార్టీ కాదట. ఏదో సిరీస్ లేదా సినిమాకు సంబంధించిన వీడియోల అనిపిస్తుంది.

రేవ్ పార్టీలో నటి రోహిణి అరెస్ట్.. హేమ డ్రగ్ పార్టీ తరహాలోనే.. | jabardasth  rohini caught in a rave party video has gone viral - Telugu Filmibeat

దీనికి కారణం ఆమెను వెంటాడుతున్న మీడియా ప్రతినిధులు మైక్ మీద అస్సలు బ‌య‌ట అస‌లు లేని ఛానల్ నెంబర్లు కనిపించడమే. అయితే ఇది బర్త్డే బాయ్ మూవీ ప్రమోషన్స్ అన్ని సమాచారం. ఇక ఈ వీడియోలో నాకేం సంబంధం లేదు సార్.. బర్త్డేపార్టి ఉందంటే వచ్చా అని చెప్తూ ఉండగా.. నీకు పాజిటివ్ వచ్చిందట కదా అని మీడియా ప్రతినిధి అడుగుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. దానికి ఆమె నాకు అసలు టెస్ట్ లే చేయలేదు.. ఎలా పాజిటివ్ వస్తుందంటూ రియాక్ట్ అయినట్టు.. ఈ ఎన్నారైలు బర్త్డే పార్టీ అని పిలిస్తే.. ముందు వెనుక ఆలోచించకుండా అసలు రాకుండా ఉండాల్సిందంటూ ఏడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అయితే ఇది మూవీ ప్రమోషన్ వీడియోనా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట తెగ చక్కర్లు కొట్టడంతో రోహిణి రేవ్‌ పార్టీలో దొరికింది అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.