పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మైథలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజై మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే 700 కోట్ల క్లబ్లోకి చేరి మంచి రికార్డ్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో బ్యాక్ బోన్ గా నిలిచే పాత్రలలో కృష్ణుడిది ఓకటి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో అన్ని పాత్రలను నాగ్ అశ్విన్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. కృష్ణుడి పాత్రను మాత్రం ఫేస్ రివిల్ చేయకుండా దాచి పెట్టాడు.
ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్‌కు కృష్ణుడి ముఖాన్ని రివిల్ చేయకపోవడానికి కారణం ఏంటి..? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై అశ్విన్ మాట్లాడుతూ.. కృష్ణుడు డార్క్ షెడ్ లో ఓ రూపం వ్యక్తిగా ఉండాలని ఆలోచన మొదటి నుంచి ఉండేది.. అలా కాకుండా ఆ పాత్ర కోసం ఎవరైనా నటుడిని నటింపజేస్తే.. అది కేవలం నటనలాగే.. అతను ఓ యాక్టర్ లానే ఉండిపోతుంది. అలా కాకుండా కృష్ణుడు అలా ఆడియన్స్‌లో గుర్తుండిపోవాలనే ముదురు రంగు చీకటి రూపుంలో చూపించాలని మొదటి నుంచి భావించాను.
అంతే దాని వెనుక ఎలాంటి ప్లాన్ లేదంటూ వివరించాడు. మొదటి నుంచి అలానే చూపించాం.. ఇకపై కూడా అలాగే కొనసాగిస్తానంటూ ఆడియన్స్‌కు ట్విస్ట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కృష్ణుడుగా నటించిన కృష్ణ కుమార్ ముఖాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించకపోయినా.. అతనికి ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది. లార్డ్ కృష్ణ పాత్ర సినిమా హైలెట్ లో ఒకటిగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాత్రకు అర్జున్‌ధాస్ వాయిస్ ఓవర్ మరింత హైలెట్ అయింది. అయితే కృష్ణుడి మొఖాన్ని చూపించకుండా సినిమా తెరకెక్కించడానికి వెనుక ఇంత అర్దం ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.