టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు.మొదట ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడ. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన రాజ్ తరుణ్.. కొంతకాలం గ్యాప్ తో ఇటీవల మరోసారి సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా నర్సింగ్ పిఎస్ లో రాజ్ తరుణ్ లవర్ని అంటూ ఓ యువతీ అతనిపై ఫిర్యాదు చేసింది. రాజ్ తరుఝణ్ ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడని.. శారీరకంగా నన్ను వాడుకొని వదిలేసాడంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది.
తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది. ప్రస్తుతం ఈ యువతి కేసుపై దర్యాప్తుల చేపట్టారు పోలీసులు. తాను రాజ్ తరుణ్ తో 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు వివరించిన ఆ యువతి.. మేమిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామంటూ వివరిస్తుంది. ఓ సినీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని నన్ను వదిలేసాడని.. ఆ ఫిర్యాదుల పేర్కొంది. రాజ్ తరుణ్‌ను నేను వదిలేయాలని.. లేదంటే చంపేస్తానని నన్ను బెదిరిస్తున్నారని ఆమె ఈ ఫిర్యాదులో వివరించింది.
తనని అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించి 45 రోజులు జైల్లో ఉండేలా చేశారని ఆమె వెల్లడించింది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ యువతి చేసిన కామెంట్స్‌తో పాటు రాజ్ తరుణ్ ఆమెతో క్లోజ్‌గా ఉన్న ఫోటోస్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అంత ఆశ్చర్యపోతున్నారు. చూడడానికి అమాయకంగా చిన్నపిల్లాడిలా కనిపించే ఈ హీరో ఇలాంటి వాడా అంటూ.. సెలబ్రిటీ స్టేటస్ అడ్డుపెట్టుకొని ఎలాంటి పనులు చేయడానికి అయినా తెగిస్తారా అంటూ.. ఇలాంటి అసలు వదిలిపెట్టకూడదంటూ రాజ్ తరుణ్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.