టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్్ ఇటీవల నటించిన మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా రూపొందిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశా పఠాని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో రూపొందింది. గత నెల జూన్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే రూ.700 గ్రాస్ కొల్లగొట్టి 1000 కోట్ల రన్ వైపు దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మొదటి భాగంలో మహాభారతంలోని ఎన్నో కీలక పాత్రలు కనువిందు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ సినిమా టైటిల్ ప్రకటన వచ్చినప్పుడు సినిమాలో కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు.
అయితే ఇందులో ప్రభాస్ భైరవ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే మహాభారత నేపథ్యంలోను కర్ణుడి పాత్రలో ప్రభాస్ కనిపించాడు. కాగా ఈ సినిమాలో అసలైన కల్కి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచాడు అశ్విన్. కల్కి యూనివర్స్ లో భాగంగా పలు సినిమాలు రానున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే కల్కి 2ను అఫీషియల్ గా వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 60 శాతం పూర్తయిందని.. ఇక వచ్చే ఏడాది జూన్ లోపు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో కల్కి ఎవరు అనే అంశంపై నెటింట న్యూస్ తెగ వైరల్ గా మారింది.
ఈ యూనివర్స్ లో కల్కిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కల్కి పాత్రలో నటిస్తున్నాడని వార్తే అభిమానుల్లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆయనతో పాటు పలువురు స్టార్ హీరోస్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి భాగమే రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో భాగానికి తారక్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ యాడ్ అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఊహకు అందదు. ఆ దెబ్బకు బాహుబలి 2 రికార్డులు బ్రేక్ అవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.