‘ కల్కి ‘ లో బైరవ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ బడా హీరో ఎవరో తెలుసా.. కథ నచ్చిన సినిమా ఎందుకు రిజెక్ట్ చేశాడంటే.. ?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్లో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కి 2898 ఏడి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో ర్యాంపేజ్ చూపిస్తున్న ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై శ్రీ అశ్విని ద‌త్త్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించాడు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాన్ని కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అతి త్వరలో రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో భైరవగా మొదట ప్రభాస్‌ను కాకుండా.. మరో టాలీవుడ్ టాప్ హీరోను అనుకున్నారని.. అయితే ఆ హీరో సినిమాను రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Kalki 2898 AD: Prabhas, Deepika Padukone-starrer gets a new release date |  Bollywood - Hindustan Times

 

ఇంతకీ బైరవ రోల్ ను మిస్ చేసుకున్న ఆ అన్ అక్కీ హీరో ఎవరు.. కథ నచ్చిన సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. గతంలో నాగ్ అశ్విన్‌ మహానటి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మీట్‌లో నాగ్ అశ్విన్‌, అశ్విని ద‌త్త్‌పై ప్రశంసలు కురిపించారు చిరంజీవి. అయితే ఆ సందర్భంలో వారి మధ్య జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ గురించి చర్చ జరిగిందని.. ఆ ఆలోచన ఆగిపోయిందని తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల తర్వాత కల్కి కోసం తను రాసుకున్న కథను అశ్విన్.. చిరంజీవికి వినిపించాడట.

What happened to Nag Ashwin-Chiru project?

ఆ కథ విన్న వెంటనే కథ చాలా బాగుంది. తప్పకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటుంది అంటూ మెగాస్టార్ వివరించాడట. నాగ అశ్విన్‌ కథ చెప్పిన విధానాన్ని, అతని విజ‌న్‌కు చిరంజీవి ప్రశంసలు కురిపించాడట. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తన మనసులో కోరిక‌ను బయట పెడుతూ.. ఈ కథను మీ కోసమే రాశా. మీరు ఒప్పుకుంటే మీతోనే సినిమా చేయాలని ఉంది అని వివరించాడట. వెంటనే చిరంజీవి దానికి నో చెప్పాడట. ఈ సినిమాలో భైరవ పాత్రకు నేను అస్సలు సెట్ కానని క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చేసాడట. అంతేకాదు చిరంజీవి స్వయంగా ఈ సినిమాలో భైరవ పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్ గా ఉంటుందని.. అతనితో సినిమా తీస్తే కథకు ఖచ్చితంగా హుంద‌త‌నం వస్తుందని తన అభిప్రాయాన్ని వివరించాడట. దీంతో కల్కి ప్రాజెక్ట్ ప్రభాస్ వద్దకు వెళ్లడం.. ప్రభాస్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జ‌రిగింది.