బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ న్యూస్.. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో కల్కి అశ్వద్ధామ..!!

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రీజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సూపర్ హిట్ కాన్సెప్ట్ తో భారీ విజువల్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్లో రూపొందిన సినిమా ఏకంగా రూ.400 కోట్ల పైగా గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

Prasanth Varma Cinematic Universe (@ThePVCU) / X

ఈ సినిమాతో ప్రశాంత్.. తన పేరుతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులోనే వరుస సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా.. జై హనుమాన్ ని రూపొందిస్తున్నాడు. ఈసారి మరింత భారీ బడ్జెట్ తో.. అద్భుతమైన విజువల్స్ తో.. ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ క్రమంలో తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ముచటించిన వర్మ నెటిస‌న్ల నుంచి ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.

Prasanth Varma on 'Hanu Man' : "For a filmmaker, money is secondary, the  love we're..." - Bollywood Hungama

మీరు మన పురాణాల్లో చిరంజీవులుగా ఉన్న వారిని ప్రధాన పాత్రలుగా తీసుకునే సినిమాలు చేస్తానని అన్నారు. అశ్వద్ధామ పాత్ర కూడా ఉందా అని ప్రశ్నించగా.. దానికి ప్రశాంత్‌ స్పందిస్తూ.. ఇప్పుడు నేను కచ్చితంగా చెప్పలేను. అయితే మీరు ఊహించే ప్రతి పాత్ర నా యూనివర్స్ లో ఉంటుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దీంతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో అశ్వద్ధామ ఎంట్రీ కూడా ఖచ్చితంగా ఉంటుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇది నిజమైతే గనక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అంటూ నెటిజ‌న్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.