ఘట్టమనేని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్..వారసుడి గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఎప్పుడంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు వారి అభిమానుల్లో.. అలాగే ఇండస్ట్రీ జనాల్లో కూడా వారి ఎంట్రీ పై ఆసక్తి మొదలవుతుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో.. టాలీవుడ్ టాప్ హీరోలుగా దూసుకుపోతున్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్ అంతా కూడా ఇండస్ట్రీకి నటవారసులుగా అడుగుపెట్టిన వారే. వీరి ఎంట్రీ స‌మ‌యంలో టాలీవుడ్ అభిమానుల్లో ఎలాంటి హైప్‌ నెలకొందో అందరికీ తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో మహేష్ బాబు, రమేష్ ఇద్దరు అడుగుపెట్టినా.. రమేష్ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలో నిర్మాతగా ఆయన స్థిరపడ్డాడు. మహేష్ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఎదుగుతూ ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగాడు. తండ్రి కృష్ణ నటవారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడు.

Photo Story: Three Superstars!!

 

ఇక‌ ఘట్టమనేని మూడోతరం వారసుడిగా గౌత‌మ్‌కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ‌నున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నటుడిగా ఘట్టమనేని గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం గౌతమ్ తన ఇంటర్ పూర్తి చేసుకుని హయ్యర్ స్టడీస్ కోసం అమెరీకా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు స్టడీస్ కంటిన్యూ చేస్తూనే.. మరోవైపు న్యూయార్క్ లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. గతంలో మహేష్ నటించిన 1 నేనొక్క‌డినేలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన గౌతమ్.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే అభిమానుల్లో ఎలాంటి అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ మ‌హేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం.. గౌతంకు మరింత ప్లస్ అవుతుంది.

కానీ.. మహేష్ నటవారసత్వాన్ని.. అదే రేంజ్ లో గౌతమ్ కంటిన్యూ చేసి అభిమానుల అంచనాలను అందుకోవాలంటే.. నటనలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందుకోసమే ప్రస్తుతం గౌతంకు ట్రైనింగ్‌ ఇప్పించేలా ప్లాన్ చేశారట మహేష్ దంపతులు. ఇక గౌతమ్ న్యూయార్క్ లో నాలుగేళ్ల పాటు నటనలో ట్రైనింగ్ తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తన చదువుతోపాటు, యాక్టింగ్ స్కిల్స్ ట్రైనింగ్‌ను కూడా పూర్తి చేసుకుని నాలుగేళ్ల తర్వాత గౌతం మహేష్ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడట. ఇక మహేష్ గారాల పట్టి సితార ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏ సినిమాలోని నటించకపోయినా ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. యాక్టింగ్ పై చాలా ఇంట్రెస్ట్ కూడా ఉందని సితార పలు సందర్భాల్లో వివరించింది. ఇక మహేష్ తన గారాల పట్టి సితారను కూడా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారో.. లేదో.. వేచి చూడాలి.