టాలీవుడ్ నట సామ్రాట్ ఏఎన్ఆర్, మూవీ మొగల్ రామానాయుడుకు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ రియల్ లైఫ్ లో వియ్యంకులన్న సంగతి కూడా తెలిసిందే. కాగా వీరిద్దరి మధ్యలో గతంలో ఓ గొడవ జరిగిందట. అది కూడా ఓ పాట కారణంగా అంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఇద్దరు స్టార్ సెలబ్రెటీల మధ్య గొడవ పెట్టిన ఆ పాట ఏంటి..? అసలు ఏం..? జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఏఎన్ఆర్ తెలుగు సినిమా పరిశ్రమకు వెస్ట్రన్ స్టెప్పులు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ కాలంలో ఆయన చేసిన డ్యాన్స్ స్టెప్స్.. మెయింటైన్ చేసిన స్టైల్‌తో.. యూత్‌కు ఐకాన్‌గా నిలిచాడు. అంతగా ఫ్యాషన్ మెయిన్టైన్ చేసిన ఏఎన్ఆర్.. సంస్కృతికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక ఆయన సినిమాల్లో శృతి మించిన రొమాన్స్ కూడా చేసేవాడు. కానీ.. డబల్ మీనింగ్ డైలాగ్లు, పాటలు ఉంటే మాత్రం దానికి నిర్మంమాటంగా నో చెప్పేసేవాడు.
అలాంటి ఓ పాట విషయంలోనే స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడుకి, ఏఎన్ఆర్ కి మధ్యన ఓ వివాదం తలెత్తిందట. ఇంతకీ ఆ పాట ఏంటా..? అనుకుంటున్నారా. అదే లేలేలే నా రాజా.. సాంగ్. ఈ పాటలో నటించడం నాగేశ్వరరావుకు మొదట అసలు ఇష్టం లేదట. ఇదే విషయాన్ని స్వయానా తన వియ్యంకుడైన రామానాయుడుతో వివరించాడట. రామనాయుడు ఎంత నచ్చజెప్పాలని చూసినా తనకి ససేమిరా ఏఎన్ఆర్ నో చెప్పేశాడట. ఇక ఈ సినిమాకు దర్శకుడుగా అప్పటి అగ్ర డైరెక్టర్.. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తండ్రి కే. ప్రకాష్ రావు వ్యవహరించాడు. అయితే ఈ పాట లేకపోతే సినిమాకు చాలా పెద్ద లోటుగా ఉంటుందని.. ఈ పాట కచ్చితంగా పాపులర్ అవుతుందంటూ దర్శక, నిర్మాతలు గట్టిగా నమ్మారు. ఇక ఈ పాటకు ఆత్రేయ సాహిత్యం, మహదేవన్ సంగీతం అందించారు.
ఈ పాటను ఒక్కసారి వినండి.. అందులో మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదంటూ దర్శకుడితో కలిసి.. రామానాయుడు అక్కినేనికి నచ్చజెప్పాడట. అయితే అక్కినేని మొదట ఈ పాట లేకుంటేనే సినిమాలో నటిస్తానని చెప్పినా.. రామానాయుడు, ప్రకాష్ రావు కలిసి ఏఎన్నార్ ఇంటికి వెళ్లి బ్రతిమలాడడంతో చేసేదేమీ లేక.. ఏఎన్ఆర్ చివరకు దానికి ఒప్పుకున్నారు. రెండు రోజులు పాటు జరిగిన ఈ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. అక్కినేని పాటకు ఒపుకున్నారు. ఆయన పక్కన డ్యాన్స్ చేసింది మరెవరో కాదు.. వ్యాంప్ పాత్రలో నటించి అప్పటికే మంచి పాపులారిటి దక్కించుకున్న జ్యోతిలక్ష్మి.
ఈ పాట అప్పట్లో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఓ సందర్భంగా అక్కినేని స్వయంగా వివరించాడు. నాకు మొదట ఈ పాటలో నటించడం ఇష్టం లేదు.. కానీ డైరెక్టర్ గారు బలవంతం చేయడంతో డైరెక్టర్ మాటను కాదనలేక ఒప్పుకున్నానని.. కానీ వాళ్ళు చెప్పినట్లే నిజంగా ఈ పాట అద్భుతంగా వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో అన్ని పాటలు మంచి సక్సెస్ సాధించాయి అంటూ ఏఎన్ఆర్ వివరించాడు. ఇక ఇప్పటికీ ఈ సాంగ్ చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటుంది.