“గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి” ఫస్ట్ డే కలెక్షన్స్: కక్కలేని మింగలేని పరిస్ధితిలో విశ్వక్ సేన్ ..మొత్తం ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ కొందరు హీరోలు సినిమాలు అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు . అలాంటి లిస్టులోకే వస్తాడు విశ్వక్సేన్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ అంటూ పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్సేన్ తాజాగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . నేహా శెట్టి – అంజలి కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమా శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

అయితే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటే మరో వర్గం ప్రేక్షకులకు ఎక్కడో కాలిపోయేలా చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. దీనితో ప్రెస్ మీట్ పెట్టి మరి విశ్వక్సేన్ వార్నింగ్ ఇచ్చేసాడు . సినిమాను చూసి రివ్యూ ఇస్తే బాగుంటుంది అని తేల్చి చెప్పేసాడు . అఫ్ కోర్స్ కష్టపడి సినిమా చేసిన తర్వాత రిజల్ట్ బాగాలేదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది . అయితే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన సరే కలెక్షన్స్ మాత్రం కుమ్మి పడేసాడు విశ్వక్సేన్.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ డే కలెక్షన్స్ రిలీజ్ అయ్యాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే 4.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇది విశ్వక్సేన్ సినిమాకి చాలా చాలా డీసెంట్ కలెక్షన్స్ అంటూ కూడా ఫాన్స్ పొగిడేస్తున్నారు.నిజాంలో ఏకంగా కోటీ పది లక్షలు రాబట్టింది వైజాగ్‌లో 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 28 లక్షలు, వెస్ట్ గోదావరి 24 లక్షలు, గుంటూరు 30 లక్షలు, నెల్లూరు 17 లక్షలు, సీడెడ్‌ 76 లక్షలు వసూలు చేసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు. ఓవర్సీస్‌ కలుపుకుంటే నాలుగు కోట్లు దాటిందని చెప్పొచ్చు.