లాస్ట్ మినిట్ లో కొంప ముంచేశాడురోయ్.. పవన్ కళ్యాణ్ స్ధానంలోకి ఎన్టీఆర్ రాబోతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు..? ఏం జరుగుతుందో..? ఎవ్వరు ఊహించలేరు.. మరొకసారి అలాంటి సిచువేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే.. త్వరలోనే ప్రభాస్ నటించిన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . జూన్ 27వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది ఈ సినిమా . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద బడా స్టార్స్ ని కూడా రంగంలోకి దించుతున్నారు నాగ్ అశ్వీన్.

ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి – చిరంజీవి – పవన్ కళ్యాణ్ లాంటి బడా స్టార్స్ ని రంగంలోకి దించుతున్నాడు నాగ్ అశ్వీన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నిన్న మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ స్థానంలోకి ఎన్టీఆర్ రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఏ స్టార్ హీరో వచ్చినా సరే అది ప్రభాస్ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. అయితే రాజమౌళి మాత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు పలువురు బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్స్ ని కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నారట. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సగం హిట్ కొట్టేలా ఉన్నాడు ప్రభాస్ – నాగ్ అశ్వీన్ అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!