ఆర్‌ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఓ రేంజ్ లో రాజమౌళి నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈసారి జక్కన్న మూవీ ఎలా ఉండనుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనుందని అది కూడా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కనుందని ఇప్పటికే జక్కన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది. మహేష్, రాజమౌళి కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని టాక్.
ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడం ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎస్ఎస్‌ఎమ్‌బి 29 ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త నెటింట వైరల్ అవుతూనే ఉంది. గత వారం రోజులుగా మహేష్, జక్కన్న ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం సినీ వర్గాల్లో తెగ వైరల్ గా మారింది. మహేష్, జక్కన్న కాంబో మూవీలో బాహుబలి.. (కట్టప్ప) సత్యరాజు నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇంటర్వ్యూలో మాట్లాడిన సత్యరాజ్ అసలు విషయాన్ని రివీల్ చేశాడు.
డైరెక్టర్ రాజమౌళి ఎంతో రుణపడి ఉన్నానని.. సౌత్ లో అందరూ నన్ను సత్య రాజ్‌గా గుర్తుపట్టే వారిని.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో నన్ను కట్టప్పగా.. రాజమౌళి పరిచయం చేశాడని.. ఈ యానిమేషన్ సిరీస్ రావడంతో ఆయనను చిన్న పిల్లలు కూడా ఇలాగే గుర్తుపడతారు అంటూ వివరించాడు. బాహుబలిలో తనకు కండలు ఉన్నట్టుగా చూపించాడని ఇక యానిమేషన్ సిరీస్ లో ఇంకాస్త ఎక్కువగానే చూపించారంటూ వివరించాడు. దీంతో బయట కూడా తను అలాగే ఉంటాను అని పిల్లలు అనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి, మహేష్ పాత్రలో ఒక రోల్ కోసం నన్ను ఎవరు సంప్రదించలేదని.. ఛాన్స్ వస్తే తప్పకుండా ఆ సినిమాలో నటించి తీరుతా అంటూ వివరించాడు.