ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పుష్పా 2లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్స్ లో వస్తుందా.. అంటూ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఏడది ఆగస్టు 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
కాగా పుష్పాకు పోటీగా మరో నేషనల్ అవార్డు విన్నర్ మూవీ అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆ నేషనల్ అవార్డు విన్నర్ ఎవరో కాదు.. మన టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్. ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన రఘు తాత.. సుమన్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. హేంబలె ఫిలిం ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి.. తాజాగా టీజర్ రిలీజ్ చేస్తూ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇక మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ నుంచి చివరిగా రిలీజ్ అయిన పుష్పా సినిమాతో ఆయన కూడా నేషనల్ అవార్డ్ దక్కించుకున్నాడు. దీంతో నేషనల్ అవార్డ్ అందుకున్న ఇద్దరి స్టార్స్ మధ్య ఒకేసారి మూవీ రిలీజ్ తో గట్టి పోటీ మొదలుకానుంది. దీంతో పుష్ప గాడు, మహానటి మధ్యన వార్ షురూ కానుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.