టాలీవుడ్ స్టార్ బ్యూటీ అంజలి ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత తాజాగా గీతాంజలి మళ్లీ వస్తుంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇక నిన్ననే రిలీజ్ అయి మంచి టాక్స్ తెచ్చుకుంటున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది అంజలి. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు.
ఆ టైంలో విశ్వక్ తో పాటు హీరోయిన్ నేహా శెట్టి, అంజలి మిగతా నటీనటులు సాంకేతిక నిఫుణులు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్న అంటూ వెల్లడించాడు. ఈ క్రమంలో బాలకృష్ణ నవ్వుతూ అంజలిని చేత్తో నేడుతూ సరదాగా చేసిన సంఘటనను నెట్టింట వైరల్ చేస్తూ అంజలితో.. బాలకృష్ణ అనుచిత ప్రవర్తన అంటూ అత్యుత్సాహంతో కొంత మంది ఆ వీడియోను ప్రమోట్ చేస్తూ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం నేషనల్ లెవెల్ లో జరిగింది.
దీనిపై తాజాగా స్పందించిన అంజలి ట్విట్టర్ వేదికగా బాలకృష్ణ నేను మంచి స్నేహితులం.. ఆయన, నేను ఇద్దరం ఒకరికి ఒకరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటామని.. తాజాగా ఆయనతో కలిసి స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ షేర్ చేసింది. అదే విధంగా ఈవెంట్ లో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ వీడియో రూపంలో ఎడిట్ చేసి ఆమెతో బాలయ్య నవ్వుతూ మాట్లాడడంతో పాటు.. ఆమెని తోసిన క్లిప్ కూడా యాడ్ చేసింది. ఇక గతంలో బాలకృష్ణ, అంజలి జంటగా గతంలో డిక్టేటర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.