కార్ డిక్కీ లో శవాన్ని పెట్టుకొని జర్నీ చేస్తున్న నివేదా పేతురాజ్.. షాకింగ్ విషయాలు రివిల్.. ?!

ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ నివేద పేతురాజు కార్‌ను పోలీసులు అడ్డగించి తనిఖీ చేయాలంటూ కోరిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆమె కారు తనిఖీకి నివేదా ఒప్పుకోలేదు. తెలుగు, తమిళ్ భాషలో నివేదనకు మంచి ఇమేజ్ ఉంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు 2020లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోయిన్గా మెప్పించింది. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా ఆకట్టుకుంది. అయితే నిన్న నివేద పెతురాజ్‌ కారును పోలీసులు పట్టుకున్నారు.

Actress Nivetha Pethuraj Argues With Cops In Viral Video, SLAMS Those Filming The Altercation

ఆమె ఒంటరిగా డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళుతుండగా.. ఆమెను ఆపిన పోలీసులు కార్ చెక్ చేయాలంటూ ప్రశ్నించారు. కారు పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి అంటూ నివేద పోలీసులతో మాట్లాడింది. పేపర్స్ అవసరం లేదు కార్ డికి ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం అంటూ పోలీసులు ఆదేశించారు. అందుకు నివేద నిరాకరించడం.. కార్ డికీ ఓపెన్ చేయడం కుదరదు ఇది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని నివేదా చెప్పడం.. పోలీసులలో మరింత అనుమానాన్ని పెంచింది. ఈ సంఘటన ఫోన్ కెమెరాలో రికార్డు చేస్తుండగా.. సీరియస్ అయినా అమ్మడు షూటింగ్ ఆపించేసింది.

Paruvu Web Series | స‌స్పెన్స్‌కు తెర.. 'ప‌రువు' కోసమే పోలీసులతో గొడ‌వ‌ప‌డిన‌ నివేదా పేతురాజ్‌-Namasthe Telangana

అంత భయపడడానికి అమ్మడు కారు డిక్కీలో ఏముంది.. ఏదైనా నేరం చేసిందా.. అనే సందేహాలు వినిపించాయి. తీరా కట్ చేస్తే ఇది ఒక ప్రాంక్ అని.. ఓ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇలా గేమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నివేద ప్రధాన పాత్రలో నటించిన పరుగు సిరీస్ జీ 5లో జూన్ 14న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు కారు డిక్కీలో శవాన్ని తరలిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఈ రకమైన ప్రాంక్ చేశారని సమాచారం. ఇటీవల చాలామంది చిన్న హీరోలు ఇలాంటి ప్రాంక్స్‌ చేస్తూ తమ సినిమాపై హైప్‌ పెంచుకుంటున్నారు. విశ్వక్ సేన్‌, అల్లరి నరేష్, నందు, బిగ్ బాస్ స‌న్ని తమ ప్రాజెక్ట్ రిలీజ్ కు ముందు ఇలాంటి ఫ్రాంక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరిగిన ఈ ప్రాంక్‌ ఎన్నో విమర్శలకు దారితీసింది.