మొదట ప్రభాస్ ..ఆ తర్వాత చరణ్ ఇప్పుడు ఎన్టీఆర్ ..నెక్స్ట్ ఆ హీరోనే..!

పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయాక భాషా భేదం అంటూ లేకుండా పోయింది . మలయాళీ హీరోస్ తెలుగులో ..తెలుగు హీరోస్ తమిళ్లో.. తమిళ్ హీరోస్ బాలీవుడ్లో ఇలా అందరూ ఈజీగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ..నటిస్తున్నారు. కానీ ఏ ఇండస్ట్రీ హీరోలను ఆ జనాలు మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. పక్క భాష హీరోలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు బాలీవుడ్లో మఖం వేయడానికి వెళ్తున్న సంగతి తెలిసిందే .

ఇప్పటికే ప్రభాస్ అక్కడ స్టార్ గా మారిపోయాడు . ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఓ రేంజ్ లో కుదిపేస్తున్నాడు..ఎలా అల్లాడించేస్తున్నాడో మనకు తెలిసిందే. కాగా ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ వస్తున్నాడు . ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా కూడా చేయబోతున్నారట. ఎన్టీఆర్ కూడా వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు . అయితే ఇప్పుడు బన్నీ సైతం బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాలు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ టాక్ వైరల్ అవుతుంది.

పుష్ప2 సినిమాతో తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు బన్నీ . ఈ సినిమా హిట్ అవ్వడం పక్క అందులో నో డౌట్ .. ఈ సినిమా హిట్ అయితే బన్నీతో కచ్చితంగా బాలీవుడ్ హాలీవుడ్ డైరెక్టర్స్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . అసలే స్టైలిష్ స్టార్ అందులోనూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ..ఏ డైరెక్టర్ బన్నీని మిస్ చేసుకుంటాడు చెప్పండి ..? అయితే ప్రభాస్ – చరణ్ – తారక్ కన్నా బన్నీ కూసింత ఎక్కువ రేంజ్ లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమడ గలడు అంటున్నారు అభిమానులు . చాలామంది హీరోయిన్స్ బన్నీతో నటించాలని ఉంది అంటూ పలు ఇంటర్వ్యూస్ చెప్పుకొచ్చారు . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!