త్రివిక్రమ్ కెరియర్ దగ్గరుండి చక్కబె డుతుంది ఆ లేడీ నేనా..? వైరల్ గా మారిన లేటెస్ట్ న్యూస్..!

త్రివిక్రమ్ శ్రీనివాసరావు.. మొదట రచయితగా పరిచయమైన ఆ తర్వాత తనలోని టాలెంట్ను బాగా ప్రూవ్ చేసుకొని డైరెక్టర్గా కూడా మారాడు . ఒక రచయితగా ఒక డైరెక్టర్గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు . రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన తర్వాత కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే స్టొరీ లైన్స్ అందించారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంత జాన్ జిగడి దోస్తులు అనే విషయం గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

కాగా చాలా కాలం తర్వాత మళ్లీ త్రివిక్రమ్ రచయితగా మారిపోతున్నాడు . సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించబోతున్న నెక్స్ట్ సినిమాకి కధ అందించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తుంది త్రివిక్రమ్ భార్య సౌజన్య . అయితే గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ని బాగా ట్రోల్ చేశారు జనాలు . అలా ఇలా కాదు తూ ఈ జీవితం ఎందుకురా అనే విధంగా ఆయనను మాటలతో ఇబ్బంది పెట్టారు.

అలాంటి ట్రోలింగ్ నుంచి త్రివిక్రమ్ కోలుకోవడానికి మెయిన్ రీజన్ ఆయన భార్య సౌజన్యనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సౌజన్య చాలా టాలెంటెడ్ ..చాలా కూల్ పర్సన్.. భర్తను ఆ ట్రోలింగ్కి బలవ్వకుండా చాలా పకడ్బందీగా ఆ బాధల నుంచి బయట పడేసిందట . అంతేకాదు వన్స్ రచయితగా మళ్లీ త్రివిక్రమ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటే తన స్థానం తనకి దక్కుతుంది అంటూ సౌజన్య సజెషన్తో నే రచయితగా మారుతున్నాడట త్రివిక్రమ్. ప్రజెంట్ ఇదే న్యూస్ తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం సౌజన్య ఇచ్చిన సజెషన్ త్రివిక్రమ్ కి ఎలా వర్కౌట్ అవుతుందో..?