అభిమానులకు బిగ్ షాక్.. పెళ్లికి ముందే విడిపోయిన స్టార్ రొమాంటిక్ లవర్స్..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పుట్టినంత ఈజీగా మరి ఏదీ పుట్టదు. చూసి చూడంగానే నచ్చేయడం ..ఆ తర్వాత నవ్వేసుకోవడం ..ఆ తర్వాత చిందేయడం.. ఆ తర్వాత కాళ్లపై కాళ్లు వేసుకోవడం చేతిలో చేయి వేసుకోవడం ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు. అవన్నీ సినిమా ఇండస్ట్రీలో కామన్ ..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్స్ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ముందుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తంతూ ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది .

పెళ్లయిన విడాకులైన హీరోయిన్స్ ని ఎక్కువగా వేరే హీరోస్ వలలో వేసుకుంటూ ఉంటారు . ఆ హీరోయిన్స్ కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సంచలన ప్రేమ పావురాలుగా మారిపోయారు మలైకా అరోరా అర్జున్ కపూర్ . వీళ్ళ మధ్య ఎంత ఏజ్ తేడా ఉంది అన్న విషయం కూడా అందరికీ తెలుసు . అయితే ప్రేమకు కులమతాలే కాదు ఏజ్ కూడా అడ్డురాదు అంటూ ప్రూవ్ చేసింది ఈ జంట . డేటింగ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది .ఆ తర్వాత వీళ్ళ రొమాంటిక్ ఫొటోస్ చూడలేక జనాలు చచ్చిపోయారు .

సీన్ కట్ చేస్తే అసలు ఈ జంట ఇప్పుడు ఎక్కడ ఉంది ..?ఏం చేస్తుంది ..? అనే విషయాలు ఎవరికీ తెలియడం లేదు. బాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుందట .ఒక యంగ్ హీరో కారణంగా అర్జున్ కపూర్ మలైక అరోరా విడిపోయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది , అంతేకాదు ఈ మధ్యకాలంలో మలైకా ఎక్కడికి వెళ్లిన సింగిల్గానే అటెండ్ అవుతుంది. అంతకు ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫంక్షన్ అంటే చాలు ఈ ప్రేమ పావురాలు చేతిలో చేయి వేసుకొని వాలిపోయేవాళ్ళు .. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిపోయింది. అర్జున్ కపూర్ అసలు బయటకు కనిపించడం లేదు.. మలైకా సింగిల్గానే హాట్ హాట్ ఫొటోస్ తో టెంప్ట్ చేస్తుంది. దీంతో వీళ్లు విడిపోయారు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి దీనిపై ఈ జంట ఏ విధంగా ఆన్సర్ ఇస్తుందో..??