“కల్కి” సినిమా ట్విట్టర్ రివ్యూ : ఆ ఒక్క సీన్ తోనే 1000 కోట్లు కలెక్ట్ చేసేయచ్చు.. గూస్ బంప్స్ పక్క..!

ఫైనల్లీ .. కోట్లాదిమంది రెబెల్ ఫ్యాన్స్.. ఎంతోమంది సినీ లవర్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది. ఎప్పుడో సినిమా స్టార్ట్ అయిన కల్కి చాలాసార్లు రిలీజ్ వరకు వచ్చి వాయిదా పడింది. దీన్ని కొంతమంది బ్యాడ్ సెంటిమెంట్ అంటూ కూడా ట్రోల్ చేశారు. అయితే కథా కంటెంట్ ఉంటే జనాలు ఎలాంటి సినిమాలను అయినా సరే ఆదరిస్తారు అని చెప్పడానికి ఇదే ది బెస్ట్ ఎగ్జాంపుల్ .

నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి నుంచి ఎలాంటి హై పాజిటివ్ టాక్ నెలకొందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడం ప్లస్ పాయింట్ ..అయితే నాగ్ అశ్వీన్ ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చూస్ చేసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడమే ఈ సినిమాకి హైలైట్ అయ్యే విషయం .

కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాపై జనాలు ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. మరి ముఖ్యంగా నాగ్ అశ్విన్ విజన్ పై పెద్దపెద్ద బడా స్టార్స్ కూడా ఓ రేంజ్ లో ప్రశంసిస్తూ ఉండడం గమనార్హం . అయితే సినిమా చూసిన జనాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేది ఒకే ఒక్క సీన్ గురించి .. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ వేరే లెవెల్ అని .. బుజ్జి ని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రభాస్ మాట్లాడిన డైలాగ్స్ బాడీ మోడ్లేషన్స్.. లాంగ్వేజ్ హైలెట్గా మారిపోతుంది అని .. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ ని ఏ విధమైనటువంటి కామెడీ యాంగిల్ లో చూస్తామో.. అదే కామెడీ యాంగిల్ ని చూపించడానికి నాగ్ అశ్వీన్ బాగా ట్రై చేశాడు అని ..

ప్రభాస్ ఈ సినిమా రేంజ్ ని వేరే లెవెల్ లో తీసుకెళ్లాడు అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఆ ఒక్క సీన్ చూడడానికైనా సరే థియేటర్స్ కి వెళ్ళచ్చు అని సినిమా మొత్తానికి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సీన్ అదే అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అంతేకాదు ప్రభాస్ తన బాడీ మోడ్యులేషన్స్ ని చేంజ్ చేస్తూ ఏ సీన్ కి తగ్గట్టు ఆ సీన్లు ప్రవర్తించి నటించిన తీరు హైలెట్గా మారిపోయింది అని ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . మొత్తానికి బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఓ క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్ . చూద్దాం ఫస్ట్ డే ఈ సినిమా ఏ విధమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తుందో..? సినీ చరిత్రను తిరగ రాస్తుందో..?