టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు వరుస అవకాశాలను దక్కించుకుని దూసుకుపోయిన వారిలో సమంత ఒకటి. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఈ అమ్మడికి అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక స్టార్ హీరోయిన్గా ఇమేజ్ వచ్చిన తర్వాత అన్ని జానర్లను ట్రై చేసిన సమంత.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు యూ టర్్న్, ఓ బేబీ లాంటి సినిమాల్లో కూడా నటించి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. ఓ బేబీ అయితే యుఎస్ లో వన్ మిలియన్ మార్క్ చేరుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటించింది.
మరో పక్కన వెబ్ సిరీస్‌లతోను తన సత్తా చాటింది. ఇక బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్ లో నటించిన సమంతా ఈ సిరీస్ తో హిట్ టాక్ తెచ్చుకుంది. రాజ్ అండ్ డీకే ఇద్దరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. శ్రీలంక తమిళ్ రెబల్‌గా సమంత సాహసోపేత పాత్రలో నటించింది. ఈ క్రమంలో సమంతకు రాజ్, డీకే మరోసారి సెటైడెల్ సిరీస్ తో అవకాశాన్ని ఇచ్చారు. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నటించగా సమంత నటించిన సెటడెల్ ఇండియన్ వర్షన్‌లో హనీబన్నీ పేరుతో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇలాంటి నేపథ్యంలో మూడోసారి ముచ్చటగా రాజ్, డీకే మరోసారి సమంతకు ఆఫర్ ఇచ్చారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్, డికె అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఆదిత్య రాయ్‌కపూర్ హీరోగా నటిస్తుండగా.. సమంత అయితే హీరోయిన్గా పర్ఫెక్ట్ గా ఉంటుందని ఈ సినిమాకు సమంతను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. సమంత కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆగస్టు నుండి సినిమా సెట్స్‌పైకి రానుందని.. ఈ సిరీస్ కు రక్తబీజ్ అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుండగా.. కొద్ది రోజుల క్రితమే సమంత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసిందని టాక్.
ఆమె ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుందట. ఈ సిరీస్ సమంత కెరీర్‌కు మరింత బూస్టప్‌గా నిలవనుందని తెలుస్తుంది. ఫ్యూచర్‌లో డిజిటల్ కంటెంట్ కు భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు కూడా ఈ ఓటీటీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక సమంత ఈ సినిమాతో పాటు.. లేడీ ఓరియెంటెడ్ సినిమా మా ఇంటి బంగారం సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ కూడా. ఇక దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న సమంత మరోసారి తిరిగి షూటింగ్లో బిజీ కానుందట.