“ఆ హీరోయిన్ తో బుద్ధి లేక సినిమా చేశా”.. తెలుగు డైరెక్టర్ సంచలన కామెంట్స్..!

శేఖర్ కమ్ముల .. ఈ డైరెక్టర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఫీల్ గుడ్ మూవీస్ను తెరకెక్కించే విషయంలో ఈయన గారి తర్వాతే ఎవరైనా . ఇప్పటివరకు శేఖర్ కమ్ముల ల ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు అని చెప్పడంలో సందేహం లేదు. సంవత్సరానికి ఒక ప్రాజెక్టు కాదు మూడేళ్లకు ఒక ప్రాజెక్టు తెరకెక్కిస్తాడు . కానీ ఆ ప్రాజెక్టుతో చరిత్ర తిరగ రాస్తాడు .

ఒక హ్యాపీ డేస్ ..ఒక ఆనంద్ ..ఒక లవ్ స్టోరీ .. ఒక ఫిదా లాంటి సినిమాలను తెరకెక్కించి అభిమానులను ఎలా ఆకట్టుకున్నాడో తెలిసిందే. అయితే శేఖర్ కమ్ముల తన కెరియర్లో చేసిన డిజాస్టర్ మూవీ ఏంటి అంటే మాత్రం అనామిక అని చెప్పుకొస్తున్నారు . అనామిక సినిమా నయనతారతో తెరకెక్కించి తప్పు చేశాను అంటూ తెగ ఫీలైపోయాడట శేఖర్ కమ్ముల . అనామిక క్యారెక్టర్ కి నయనతార ఫేస్ అంతగా సెట్ అవ్వలేదు అని ..

వేరే హీరోయిన్తో చేసి ఉంటే బహుశా ఈ సినిమా ఇంకొంచెం రీచ్ దక్కించుకొని ఉండేదేమోనని శేఖర్ కమ్ముల చాలాసార్లు అనుకున్నారట. మరొకసారి ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . ప్రజెంట్ శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర అనే సినిమాను తెరకెకిస్తున్నారు . నయనతార కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు సైన్ చేస్తుంది. పెళ్లి తర్వాత నయనతార ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . ఏ స్టెప్ వేసిన సరే తనకి పాజిటివ్ గా ఉండే యాంగిల్ లోనే ముందుకు వెళ్తుంది . తొందరపడి ఎలాంటి తప్పుడు డెసిషన్స్ అయితే తీసుకోవడం లేదు..!