“కల్కి” సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే సత్తా .. ఈ హీరోలల్లో ఎవరికి ఉంది..?

హమ్మయ్య … ఎప్పుడెప్పుడా అంటూ ఫైనల్లి ఎదురు చూసిన కల్కి సినిమా రిలీజ్ అయిపోయింది . సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు మారు మ్రోగి పోతుంది . ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకి మంచి టాక్ లభించింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మొదటి రోజే 120 కోట్లకు పైగా వసూలు రాబట్టి సంచలనాన్ని నమోదు చేయడమే కాకుండా సినీ చరిత్రను తిరగరాసింది . వరుసగా ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు మొదటి రోజు 100 కోట్లు క్రాస్ చేసిన మూవీలుగా కెరియర్లో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు ప్రభాస్ . ఇదే కాదు చాలా చాలా రికార్డ్స్ నెలకొల్పింది కల్కి సినిమా . ఇప్పుడు కల్కి సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే సత్తా ఏ హీరోకి ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . జనాలు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు .

సెప్టెంబర్ 27వ తేదీ రిలీజ్ కాబోతున్న దేవర సినిమా కల్కి రికార్డులను తుక్కుతుక్కు చేస్తుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . అలానే ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే కొంతమంది సినీ విశ్లేషకులు ఈ సినిమా కంటెంట్ ఆ రేంజ్ లో లేదు అని ..ఈ సినిమా రికార్డ్స్ బీట్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పుకొస్తున్నారు. పుష్ప 2 సినిమా అయిన కల్కి సినిమా రికార్డ్స్ బీట్ చేస్తుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఫస్ట్ రిలీజ్ డేట్ ప్రకారం ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయి ఉంటే కల్కి సినిమా ఈ రికార్డ్స్ బీట్ చేసే స్కోప్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు డిసెంబర్ 6 కి వెళ్ళిపోయింది .. పైగా సినిమాపై కొన్ని నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నాయి . అదేవిధంగా మెగా అభిమానుల్లో బన్నీపై నెగిటివిటి కూడా వచ్చింది. ఒకవేళ లాస్ట్ మినిట్ లో ఏ హీరో ఫ్యాన్స్ అటూ ఇటూ గా మారిన పుష్ప సినిమా రికార్డ్స్ బీట్ చేయడం కూడా అంత ఈజీ కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు . మరి మీరేమనుకుంటున్నారు కల్కి సినిమా రికార్డ్స్ బీట్ చేసే సత్తా ఎవరికి ఉంది.. దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ కా..? పుష్ప సినిమాలో నటిస్తున్న బన్నీకా..? గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ కా..?