జానీ మాస్టర్ మోసం చేశాడంటూ పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన సతీష్.. ఏం జరిగిందంటే..?!

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కొద్ది రోజుల క్రితం డ్యాన్సర్ సతీష్ ప‌వ‌న్‌కు ఫిర్యాదు చేశాడంటూ వార్త‌లు వినిపించిన‌ సంగతి తెలిసిందే. సతీష్ మాట్లాడుతూ నేను టిఎఫ్‌టిడిడి ఏ అధ్యక్షుడిగా వివరణ ఇస్తున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం రూ.5 కోట్లతో ఒక స్థలాన్ని కొన్నాము. అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడింది. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తారని.. అలాగే అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాడ‌ని ఆయన్ని ఎంచుకున్నాం.. అంటూ వివ‌రించాడు.

I Will Quit Film Industry If Found Guilty: Choreographer Jani Master |  Times Now

దీనిపై స్పందించిన జానీ మాస్టర్.. నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యి 6 నెలలు అయిందని.. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ఎలక్షన్ కోడ్ రావడంతో నా ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది అంటూ వివరించాడు. అప్పుడే రంజాన్ మొదలైంది.. ఇక నేను ఎలాంటి పాటలు వినను, పాటలు కంపోస్ కూడా చేయను. నెలరోజులు ఉపవాసం చేస్తా.. దీంతో నేను ఆ పనులను పూర్తి చేయలేకపోయా.. ఇక సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నేను అప్పటికే రామ్ చరణ్, ఉపాసన గారితో మాట్లాడాను అంటూ వివరించాడు. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టం అంటూ చెప్పుకొచ్చాడు.

Jani Master (@alwaysjani) • Instagram photos and videos

పనులు కార్యాచరణ సవ్యంగా సాగుతుంది అని.. తన సంస్థ కార్యకలాపాలను, తన ప్రయత్నాలను మీడియాకు వివరించాడు జానీ మాస్టర్. ఈ నేప‌ద్యంలో మా అసోసియేష‌న్‌ రూల్స్, కమిటీ ప్రకారం కొరియోగ్రాఫర్ తో చర్చలు జరిపిన తర్వాత.. సతీష్ కు లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు వచ్చినా.. డబ్బులు ఇచ్చి ఆదుకుంటామంటూ చెప్పిన మా అసోసియేషన్ ఒకరి పొట్ట కొట్టడం మాకు తెలియదని.. అతడు చేసిన ఆరోపణలకు క్షమాపణలు కోరితే జరిమానా లేకుండా వదిలేసే వాళ్ళం. కానీ అలా కాకుండా నేనేంటో చూపిస్తా అంటూ తిరిగి బెదిరింపులు మొదలుపెట్టి వివాదానికి నాంది పలికాడు అంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.